అధికార పార్టీలో వున్నమన్న ధీమా.. అందులోనూ కేంద్రమంత్రులుగా బాద్యతలు వుండటం అంటే అది తక్కువేం కాదు. అయితే వాటిని ప్రజల సమస్యల పరిష్కారంలో శాఖపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో వినియోగించాల్సిందిపోయి.. అనవసర వివాదాలకు దారితీసేలా కొందరు కేంద్రమంత్రులు వ్యహరిస్తున్న తీరు అధికార పార్టీకి, ప్రధానికి తలనొప్పులు తెచ్చిపెడుతుంది. తాజాగా మహారాష్ట్ర ముంబై పోలీసు కమీషనర్ గా సేవలందించి.. రాజకీయ అరంగ్రేటం చేసిన ఓ కేంద్రమంత్రి కూడా తాజాగా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే బీజేపి నేతలు.. మహిళలకు సంబంధించిన అంశాల్లో అధికంగా జోక్యం చేసుకుంటున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న క్రమంలో.. ఆ మధ్య రాజస్థాన్ కు చెందని బీజేపి నేత అర్థరాత్రిళ్లు మహిళలకు రోడ్లపై ఎం పని అంటూ ప్రశ్నించి విమర్శలను ఎదుర్కోగా, మరోకరు అమ్మాయిలు రాత్రిళ్లు బయటకు రావాలంటే మగతోడు లేకుండా రాకూడదని కూడా వ్యాఖ్యనించారు. ఇలా ఇప్పటికే మహిళల విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న నేతల జాబితాలో తాజాగా మరో కేంద్రమంత్రి కూడా చేరిపోయి విమర్శలను ఎదుర్కొంటున్నారు.
ఉత్తర్ ప్రదేశ్ బాగ్ పాట్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జీన్స్ వేసుకుని పెళ్లి మండపంలోకి వచ్చే ఏ అమ్మాయినైనా అబ్బాయిలు పెళ్లాడతారా? అని విద్యార్థులను ప్రశ్నించారు. గోరఖ్ పూర్ మఠానికి అనుబంధంగా కొత్తగా ఏర్పాటు చేయనున్న విద్యా సంస్థ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్రమంత్రి సత్యపాల్ సింగ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
జీన్స్ ప్యాంట వేసుకుని వచ్చి.. ‘నేను మత గురువుగా ఉంటాను’ అంటే మనం అంగీకరిస్తామా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం. అలాగే అమ్మాయిలు జీన్స్ ధరించి పెళ్లి మండపంలోకి వస్తే ఏ అబ్బాయైనా చచ్చినా ఆమెను పెళ్లి చేసుకోడు’ అని సత్యాపాల్ సింగ్ వ్యాఖ్యానించారు. అయితే అదే వేదికపై ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ కూడా ఉన్నారు. యోగి ప్రధాన అర్చకుడిగా ఉన్న గోరఖ్ పూర్ మఠానికి అనుబంధంగా నడిచే మహారాణా ప్రతాప్ శిక్షా పరిషత్ (ఎంపీఎస్పీ) విద్యాలయం శంకుస్థాపన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా మహిళలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కూడా ఎలాంటి స్పందన తెలియజేకపోవడంతో మహిళా సంఘాలు అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more