Pawan Kalyan‏ requests AP MPs to take cue from Tamil MPs తమిళ నేతలను అదర్శంగా తీసుకోండి: ఎంపీలకు పవన్ సూచన

Pawan kalyan requests ap mps to take cue from tamil nadu cm palaniswami

Society,Jana Sena Party Chief Pawan Kalyan‏,AP MPs,Andhra Pradesh MPs,DCI,Tamil Nadu Chief Minister,CM Edappadi K Palaniswami,Pawan Kalyan appeal AP MPs,Prime Minister Narendra Modi,Narendra Modi privatise DCI,Dredging Corporation of India,Salem Steel Plant

Jana Sena Party chief Pawan Kalyan‏ has requested the MPs of Andhra Pradesh to take a cue from Tamil Nadu Chief Minister Edappadi K Palaniswami and appeal Prime Minister Narendra Modi against privatising Dredging Corporation of India.

తమిళ నేతలను అదర్శంగా తీసుకోండి: ఎంపీలకు పవన్ సూచన

Posted: 12/19/2017 10:17 AM IST
Pawan kalyan requests ap mps to take cue from tamil nadu cm palaniswami

రాష్ట్రానికి చెందిన ఓ ప్రభుత్వ రంగ సంస్థను కాపాడుకునే విషయంలో రాష్ట్ర పార్లమెంటు సభ్యులు ఎందుకు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారో అర్థంకాని విషయంగా మారిందని సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్ అవేదన వ్యక్తం చేశారు. ఇదివరకు ఓ సారి రాష్ట్ర ఎంపీలను ప్రత్యేక హోదా విషయంలో కడిగేసిన ఆయన వారి నుంచి పలు విమర్శలను కూడా ఎదుర్కోన్నారు. ఆ తరువాత వారిని టార్గెట్ చేశారు. కేవలం వ్యాపారాలను చక్కబెట్టుకునేందుకే ఎంపీ పదవులకు పోటీపడుతున్నారే తప్ప. రాష్ట్రానికి, ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశం ఏ కోశాణ వుండదా అని ప్రశ్నించారు.

ఇక తాజాగా, మరోమారు పార్లమెంటు సభ్యులను ఆయన ఢిల్లీలో వెళ్లి రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని కోరారు. ఎంపీలంతా కలసి లాభాల్లో ఉన్న డీసీఐ (డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ప్రైవేటీకరణ యత్నాలను అడ్డుకునే దిశగా ఢిల్లీకి వెళ్లి, ప్రధాని నరేంద్ర మోదీని కలవాలని సూచించారు. ఎంపీలంతా వెళ్లి ఆయనకు ఓ వినతిపత్రాన్ని ఇవ్వాలని సూచించారు. ఈ విషయంలో తమిళనాడును ఆదర్శంగా తీసుకోవాలని, నష్టాల్లో ఉన్నప్పటికీ, సేలం స్టీల్ ప్లాంటును ప్రైవేటు సంస్థలకు అప్పగించకుండా ఆ ప్రభుత్వం అడ్డుకుంటోందని గుర్తు చేశారు.

తమిళనాడు రాష్ట్ర ప్రజల వెనుక అక్కడి నేతలు నిలబడగా లేనిది, మన రాష్ట్రంలో నేతలు మాత్రం అదే తరహా సమస్య పరిష్కారానికి ముందడుగు వేయకపోవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అన్నారు. ఏపీ నేతలను ఎవరు ఆపుతున్నారో అర్థం కావడం లేదని తన ట్విట్టర్ ఖాతా ద్వారా విమర్శించారు. ఇప్పటికే రాష్ట్ర విభజన తరువాత అన్యాయం జరిగిందని, ప్రత్యేక హోదా వంటి రాజ్యాంగ పరమైన హామీలను సైతం నెరవేర్చలేదని పవన్ వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles