Indane consumers can book LPG cylinders online ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా గ్యాస్ బుకింగ్

Now indane consumers can book lpg cylinders via social media

Gas Cylinder, IOCL, LPG Booking, Indane, Indian oil corperation ltd, facebook, twitter, social media

The Indian Oil Corporation has started an option in their website in which users of the gas cylinders can book their refill.

గ్యాస్ బుక్ చేయాలా..? ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా ప్రయత్నించారా.?

Posted: 01/10/2018 09:22 AM IST
Now indane consumers can book lpg cylinders via social media

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా..? ఫోన్ చేసి దాదాపుగా మూడు నిమిషాల వరకు అన్ని అప్షన్లు నొక్కుతూ గ్యాస్ బుక్ చేసుకుని ఫోన్ బిల్లు పెరుగుతుందని అందోళన చెందుతున్నారా..? లేక ఎస్సెమ్మెస్ ద్వారా గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నా మీ అకౌంట్లో నుంచి డబ్బులు కట్ అవుతున్నాయని అలోచిస్తున్నారా... అయితే ఇక ఈ తరహా అందోళనకు పలకండి స్వస్తి. అన్ లైన్ ద్వారా లేదా సోషల్ మీడియా వేదికగా మీ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకోండి.

అదెలా సాథ్యమంటారా..? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) గ్యాస్ బుకింగ్ మేడ్ ఈజీ చేసేసింది. అన్ లైన్ ద్వారా, లేదా సోషల్ మీడియా ద్వారా కూడా ఇండేన్ కస్టమర్లు తమ గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకోవచ్చు. సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్ వినియోగం విస్తృతం కావడంతో ఐఓసీఎల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా సామాజిక మాధ్యమాల ద్వారా గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చిన తొలి కంపెనీగా ఐఓసీఎల్ అవతరించింది. ఇక మరోవిషయం ఏంటంటే.. అన్ లైన్, సోషల్ మీడియా ద్వారా గ్యాస్ బుక్ చేసుకుంటే ఐదు రూపాయల తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్ పొందవచ్చు.
 
ఫేస్‌బుక్ ద్వారా ఇలా బుక్ చేసుకోవచ్చు..
* తొలుత మన ఫేస్‌బుక్ ఖాతా ఓపెన్ చేసుకోవాలి
* తర్వాత ఐఓసీఎల్ అధికారిక ఫేస్‌బుక్ పేజీ @indianoilcorplimitedలోకి వెళ్లాలి
* అందులో ఉన్న ‘బుక్ నౌ’ ఆప్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా గ్యాస్‌ను బుక్ చేసుకోవాలి
 
ట్విట్టర్ ద్వారా ఇండేన్ రీఫిల్ బుకింగ్ ఇలా..
* @indanerefill‌లోకి వెళ్లి సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.
* తొలిసారి మాత్రం LPGID ట్వీట్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gas Cylinder  IOCL  LPG Booking  Indane  Indian oil corperation ltd  facebook  twitter  social media  

Other Articles