మద్యం తాగి రూలు ప్రయాణం చేయడం సరాదాగా బావిస్తారు కోందరు. అయితే దీని ద్వారా మంచి నిద్ర పడుతుందని భావిస్తారు వాళ్లు. కాగా, ఇలాంటి ప్రయత్నమే చేసి అమితంగా మధ్యం సేవించిన ఇద్దరు సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు.. రైలులు నానా రభసా చేశారు. రైలులోని ఇతర ప్రయాణికుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ పై దాడి చేశారు. అమె ద్వారా విషయాన్ని తెలుసుకున్న రైల్వే టీసీలు వచ్చి వారిని నిలదీయడంతో వారిపై కూడా దాడికి పాల్పడ్డారు. దీంతో రైల్వే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. హౌరా నుంచి చెన్నై వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో అదివారం రోజును విశాఖపట్టణంలో పనిచేస్తున్న కేరళకు చెందిన శ్యామ్ కుమార్, బిన్నూ అనే ఇద్దరు సీఐఎస్ఎఫ్ కానిస్టేబుళ్లు తమ సొంతం రాష్ట్రం వెళ్లేందుకు రైలు ఎక్కారు. రైలు విజయవాడ వచ్చాక వారికి బీ1, బీ2 బోగీల్లో సీట్లు కేటాయించారు. అయితే వారు తమ సీట్లలో కాకుండా సిబ్బందికి కేటాయించే సీట్లలో కూర్చుని టాయిలెట్‌కి వెళ్లొచ్చే మహిళలను వేధించడం మొదలుపెట్టారు. అసభ్యకర వ్యాఖ్యలతో వారిని ఇబ్బంది పెట్టసాగారు.
పలు ప్రయాణికుల ద్వారా సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ వచ్చి వారిని అడ్డుకోగా, వారు అమె పట్ల కూడా అనుచితంగా ప్రవర్తించారు. ఒక మహిళా కానిస్టేబుల్ అన్న విషయాన్ని కూడా మర్చిపోయి అమెపై కూడా దాడి చేశారు. దీంతో అమె విషయాన్ని రైలులోని టీసీలు రంగనాథ్, రాధాకృష్ణలకు విషయాన్ని చేరవేశారు. దీంతో వారు వచ్చి శ్యామ్ కుమార్, బిన్నూలను నిలదీసారు. దాంతో తమనే నిలదీస్తారా అంటూ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుళ్లు వారిపైనా దాడిచేశారు.
దీంతో అర్పీఎఫ్ లేడి కానిస్టేబల్ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు.. రైలులో జరుగుతున్న గొడవ పెద్దగా మారుతున్న తరుణంలో అప్రమత్తమైన ఓ ప్రయాణికుల్లో ఒకరు చైన్ లాగడంతో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఒంగోలు స్టేషన్ కు సమీపంలో రైలు ఆగింది. సమాచారం అందుకున్న ఒంగోలు రైల్వే ఎస్సై కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకున్నారు. టీసీల ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వే ఎస్సై తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more