కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో బీజేపి పార్టీ గెలుపును తన భుజస్కందాలపై ఎత్తుకుని ప్రచారం చేస్తున్న జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు మాత్రం అక్కడ వరుస షాకులు తగులుతున్నాయి. గత నెల 30న దళిత నాయకులతో మైసూరులోని ఓ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశం మధ్యలో కొందరు దళిత సంఘాల నేతలు లేచి ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు. అమిత్ షా సహా కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్డేకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా షాకైన అమిత్ షా.. తన ప్రసంగాన్ని మధ్యలోనే అపేశారు. ఈ ఘటనను మరువక ముందే మరోమారు మైసూరులో అలాంటి ఘటనే చోటుచేసుకుంది.
కర్నాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ప్రచారం నిర్వహిస్తూ మరోమారు మైసూరుకు వచ్చిన షాకు మళ్లీ దళితసంఘాలు షాకిచ్చాయి. ఆయన రోడ్ షో నిర్వహిస్తున్నారన్న సమాచారం అందుకున్న దళిత సంఘాలు ఆయన వెళ్లే మార్గంలో అయనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలకు దిగారు. దళితులు, క్రైస్తవులపై దాడులు పెరిగిపోయాయని, వాటిని ఆపడంలో కేంద్రం విఫలమవుతోందని, దేశ జనాభాలో 30 శాతం ఉన్న దళితులు మరింత పేదలుగా మారిపోతున్నారని, అంటరానివారుగా ఉన్నారని ఆరోపిస్తూ, పలువురు అమిత్ షాను అడ్డుకున్నారు.
తాజాగా ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నీరుగార్చే చర్యలను కేంద్రం ప్రారంభించిందని ఆరోపిస్తూ, తమ విషయంలో కేంద్రం ఏం చేయాలనుందో చెప్పాలని నినాదాలు చేశారు. అడుగడుగునా తమకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. కాగా, దళితులు రోడ్డుపై బైటాయించారన్న సమాచారాన్ని ముందుగానే తెలుసుకున్న అమిత్ షా, ఆ ప్రాంతంలో జరపాల్సిన తన రోడ్ షోను రద్దు చేసుకుని వెనక్కు వెళ్లిపోయారు. కాగా, కర్ణాటకలో 19 శాతం దళితులు ఉండగా, 224 సీట్లున్న అసెంబ్లీలో 60 స్థానాల్లో జయాపజయాలను నిర్దేశించే స్థాయిలో దళిత, క్రైస్తవ ఓటర్లు ఉన్నారు.
#WATCH Disturbance at BJP President Amit Shah's interaction with Dalit leaders at Rajendra Kalamandira in Mysuru after slogans were raised against Union Minister Ananth Kumar Hegde over his remarks on the constitution. #Karnataka pic.twitter.com/33BQsMz8z1
— ANI (@ANI) March 30, 2018
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more