Kiran Bedi’s befitting reply to netzens కిరికిరి లేపిన లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ట్వీట్

Kiran bedi trolled for congratulating puducherrians on france fifa win

Kiran Bedi, Puducherry, Fifa World Cup 2018, FIFA World Cup, World Cup 2018, Football World Cup, Soccer World Cup, World Cup Final, Twitter

Puducherry Lieutenant Governor Kiran Bedi, Monday started with what’s called the Twitter attack! who congratulated the people of Puducherry for France’s victory in FIFA World Cup. Taking to Twitter, Bedi said that Puducherrians, the erstwhile French Territory won the World Cup.

కిరికిరి లేపిన లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ట్వీట్

Posted: 07/16/2018 11:23 AM IST
Kiran bedi trolled for congratulating puducherrians on france fifa win

ఫిఫా ఫుట్ బాల్ ఫైనల్ పోటీలో ఫ్రాన్స్, క్రొయేషియా మధ్య జరిగిన పోరులో ఫ్రాన్స్ విశ్వవిజేతగా నిలిచిన వెంటనే ఎందరో అభిమానులు ఆ విజయాన్ని తమదైన శైలిలో ఆనందంగా జరుపుకున్నారు. కాగా దీనిపై పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ ట్వీట్ చేసిన విధానాన్ని మాత్రం అనేక మంది నెట్ జనులు తప్పబట్టారు. ఇక మరికొందరైతే అమెను తక్షణం ప్రధాని నరేంద్రమోడీ అమెను తక్షణం పదవి నుంచి తొలగించాలని.. ఆ స్థానాన్ని ఇతరులతో భర్తీ చేయాలని కూడా సూచనలు ఇచ్చారు.

ఇక మనం భారతీయులమని, ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లు ఆపాలని సలహాలు ఇస్తున్నారు. ఈ ట్వీట్ ను పలువురు నెటిజన్లు ఎగతాళి చేస్తున్నారు. ఫ్రాన్స్ జట్టు విజయాన్ని పుదుచ్చేరియన్ల విజయంగా ఆమె అభివర్ణించడాన్ని తప్పుబడుతున్నారు. ఇంకో నెట్ జనుడు కిరణ్ బేడీ లాంటి వ్యక్తిని తాము ఢిల్లీకి ముఖ్యమంత్రిని చేయాలని తమలాంటి ఇడియట్స్ ఎంతో మంది ప్రయత్నించామని, అయితే అమె ఒక రాష్ట్ర గవర్నర్ గా వుండటమే మంచిదన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తపర్చారు. అసలు ఎందుకు ఇంత కిరికిర పంచాయితీ ఎదురైందీ.. అమె చేసిన తప్పేంటీ అంటే..

ఫ్రాన్స్ విశ్వవిజేతగా గెలుపొందడంపై అమె చేసిన ఒక ట్వీట్ దీనికి కారణం.. పుదుచ్చేరి (ఒకప్పుడు ఫ్రెంచ్ భూభాగం, ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతం) లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి చేసిన ట్వీట్ పై విమర్శలు వస్తున్నాయి. ఫ్రాన్స్ గెలిచిన తరువాత "మేము పుదుచ్చేరియన్లం. ప్రపంచ కప్ గెలుచుకున్నాం. అభినందనలు" అని ఆమె ట్వీట్ పెట్టగా, నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.  కాగా, నిన్న రాత్రి ఫ్రాన్స్ విజయం సాధించిన తరువాత, పుదుచ్చేరిలోని వీధులు క్రీడాభిమానులతో కిక్కిరిశాయి. ఫుట్ బాల్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles