విశాఖ ఎయిర్ పోర్టులో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ పై దాడి జరిపిన శ్రీనివాస రావు నేరచరిత్ర కూడా ఘనమేనని ఏపీ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ప్రతిపక్ష నేతపై కోడిపందాలకు వాడే కత్తితో దాడి చేసిన శ్రీనివాసరావుపై గతంలోనే పలు పోలీసు కేసులు నమోదయ్యాయి. కోడిపందాలపై ప్రేమతో చదువుకు మంగళం పాడేసిన శ్రీనివాసరావు, కూలీ పనులు చేసుకుని కాలం గడుపే తాతారావు, సావిత్రిల ఐదో సంతానం. ఠాణేలంకలో పదో తరగతి వరకూ మాత్రమే చదువుకున్నాడు.
గత సంవత్సరం కాగిత వెంకటేశ్ అనే యువకుడిపై దాడి చేశాడని ముమ్మిడివరం పోలీసు స్టేషన్లో ఓ కేసు నమోదై ఉంది. ఇక శ్రీనివాసరావుకు గ్రామంలోని పలువురితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ విషయమై గ్రామపెద్దలు పలుమార్లు శ్రీనివాసరావును మందలించినట్టు గ్రామస్తులు అంటున్నారు. ఇక ఏకంగా ప్రతిపక్ష నేత జగన్ పై కోడిపందేలాకు వినియోగించే కత్తితో దాడి చేయడానికి గల కారణాలు ఏంటన్న విషయమై పోలీసు ఉన్నతాదికారులు శ్రీనివాసరావుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ఇప్పటికే శ్రీనివాసరావు కాల్ డేటాను సేకరించిన పోలీసులు, అందులో తరచూ ఫోన్ కాల్స్ వెళ్లిన నంబర్ల వివరాలు, గత రెండు నెలల పరిధిలో ఆయన మాట్లాడిన కాల్స్ గురించి సమాచారాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. ఏ ఉద్దేశంతో ఈ పని చేశావు? దీని వెనుక ఎవరున్నారు? ఇటీవల పెద్ద పార్టీ ఇచ్చావటగదా? దానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎయిర్ పోర్టులో ఉద్యోగానికి ఎవరు రికమండ్ చేశారు? కత్తిని ఎలా విమానాశ్రయంలోకి తేగలిగావు? కత్తి తెచ్చిన రోజు సీఐఎస్ఎఫ్ పోలీసులు తనిఖీ చేయలేదా? వంటి ప్రశ్నలను అధికారులు సంధించినట్టు తెలుస్తోంది.
వీటితో పాటు, జగన్ పై దాడి చేస్తే, సానుభూతి వస్తుందని ఎలా అనుకున్నావు? ఆయన సీఎం అయితే బాగుంటుందని నీకు ఎవరైనా చెప్పారా? జగన్ పై దాడికి ఎవరు ప్రోత్సహించారు? తదితర ప్రశ్నలు అడిగి శ్రీనివాస్ నుంచి సమాధానాలు రాబడుతున్నట్టు తెలుస్తోంది. నిందితుడి నేర చరిత్ర, కుటుంబ నేపథ్యం, స్నేహితులు, పరిచయస్తుల వివరాలను కూడా విచారిస్తున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా, శ్రీనివాస్ ను ఇవాళ న్యాయస్థానంలో హాజరుపర్చనున్నారు పోలీసులు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more