ముంబైలో జరిగిన ఘరానా మోసం ఒకటి వెలుగులోకి వచ్చి సంచలనమైంది. కేవలం మిస్డ్ కాల్స్ ఇవ్వడం ద్వారా ఓ వ్యాపారి బ్యాంకు ఖాతాలోని రూ.1.86 కోట్లను కాజేశారు. సిమ్ స్వాప్ టెక్నాలజీ ద్వారా చాలా సులభంగా డబ్బులు కొట్టేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ముంబైకి చెందిన షా టెక్స్టైల్ వ్యాపారి. గత నెల 27న అర్ధరాత్రి అతడి ఫోన్ నంబరుకు ఆరు మిస్డ్ కాల్స్ వచ్చాయి. ఉదయం లేచాక వచ్చిన నంబర్లకు ఫోన్ చేస్తే సిమ్ బ్లాక్ అయింది.
సిమ్ బ్లాక్ కావడంతో విషయం తెలుసుకుందామని సర్వీస్ ప్రొవైడర్‌కు షా ఫోన్ చేస్తే.. మీ రిక్వెస్ట్‌తోనే సిమ్ ను బ్లాక్ చేసి కొత్త సిమ్ ఇచ్చినట్టు చెప్పడంతో ఆయన ఆశ్చర్యపోయారు. అనుమానం వచ్చిన ఆయన వెంటనే బ్యాంకుకు వెళ్లి ఖాతాలను పరిశీలిస్తే అప్పటికే రూ. 1.86 కోట్లు మాయం అయింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 14 ఖాతాలకు డబ్బు బదిలీ అయినట్టు బ్యాంకు సిబ్బంది చెప్పడంతో లబోదిబోమన్నాడు.
బ్యాంకు సిబ్బంది చాకచక్యంతో రూ. 20 లక్షలు వెనక్కి వచ్చినా మిగతా సొమ్మును అప్పటికే డ్రా చేసేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం వేట ప్రారంభించారు. షా సిమ్ నంబరును యాక్సెస్ చేసుకున్న మోసగాళ్లు సిమ్ స్వాప్ టెక్నాలజీ ద్వారా ఈ మోసానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
డిసెంబరు 27న రాత్రి 11:15 గంటలకు షా నుంచి తమకు సిమ్ స్వాప్ రిక్వెస్ట్ వచ్చినట్టు సర్వీస్ ప్రొవైడర్ చెబుతున్నారు. సిమ్ స్వాప్ ద్వారా మోసగాళ్లు కొత్త నంబరు తీసుకుంటారు. అది యాక్టివేట్ అయ్యాక ఓటీపీ నంబర్లన్నీ దానికే వస్తుంటాయి. అలా మోసగాళ్ల పని సులభం అవుతుంది. బ్యాంకు ఖాతాల నంబర్లు, బ్యాంకింగ్ ఐడీ, పాస్‌వర్డ్‌లను ముందే హ్యాక్ చేసి పెట్టుకునే మోసగాళ్లు సిమ్ చేతికి అందిన వెంటనే పని ప్రారంభిస్తారని పోలీసులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more