Nampally exhibition reopens today హైదరాబాదీలకు పున:స్వాగతం పలుకుతున్న నూమాయిష్.!

Hyderabad numaish reopens today after major fire broke out

Hyderabad exhibition reopens, Nampally Numaish re-opens, exhibition grounds, exhibition society, numaish, fire break, home minister mohammed mehmood ali, numaish, fire at numaish, cigeratte caused fire break at numaish, crime

Hyderabad exhibition familiarly known as Nampally Numaish re-opens today welcoming hyderabadis after a major fire broke out took place in 30th night. The police and exhibition organisers took all the precautions

తెరుచుకున్న నుమాయిష్.. అపన్నహస్తానికి హైదరాబాదీలు రెడీ..!

Posted: 02/02/2019 04:55 PM IST
Hyderabad numaish reopens today after major fire broke out

హైదరాబాదీలకు శుభవార్త.. నాంపల్లిలోని నుమాయిష్ ను చూద్దామనికుని అగ్ని ప్రమాదం సంభవించిన కారణంగా చూడలేకపోయామని భావించేవారికి గుడ్ న్యూస్. నాంపల్లి ఎగ్జిబిషన్ హైదరాబాదీలకు పున:స్వాగతం పలుకుతోంది. శనివారం మధ్యాహ్నం నుంచి ఎగ్జిబిషన్ తిరిగి ప్రారంభమైంది. మరోమారు తెరుచుకున్న నుమాయిష్ కు ప్రదర్శకుల నుంచి అదే స్పందన లభిస్తుంది. అగ్నిప్రమాదంలో కాలిపోయిన స్టాల్స్ స్థానంలో కొత్త వాటిని నిర్మించగా, మరికొన్నింటిని రేపటి లోగా నిర్మించనున్నారు.

ప్రమాదంతో మంటల్లో కాలిపోయిన 300 స్టాళ్లను అదే స్థలంలో కొత్త వాటిని నిర్మించామని సొసైటీ నిర్వాహకులు తెలిపారు. కాగా పక్షం రోజుల నుంచి 20 రోజుల వరకు నుమాయిష్ వుంటుందని.. ఈ రోజు నుంచి వచ్చే ఆదయాన్ని పూర్తిగా బాధితులకు పంచుతామని నిర్వాహకులు తెలిపారు. కొత్త స్టాళ్లను నిర్మించడంతో పాటు స్టాల్‌ నిర్వాహకులకు ఇప్పటి వరకూ రూ.70 లక్షలు ఆర్థిక సాయం అందించినట్లు రంగారెడ్డి చెప్పారు. అగ్నిప్రమాద ఘటన నుంచి బాధితులు కొలుకుంటున్నారన్నారు.

బాధితులకు సొసైటీ అండగా ఉంటుందని.. ఘటనపై కమిటీని ఏర్పాటు చేశామని.. నివేదిక వచ్చిన వెంటనే పరిహారం అందిస్తామన్నారు. వాస్తవానికి ఈ నెల 15తో ఎగ్జిబిషన్‌ ముగియాల్సి ఉన్నా.. మరో నాలుగు రోజులు పొడిగిస్తున్నట్లు తెలిపారు. కాగా, నాంపల్లి ఎగ్జిబిషన్ లో గత నెల 30 రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో ఏర్పడిన పొగ కారణంగా ఇద్దరు కశ్మీరులు సహా, ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. ప్రమాదం కారణంగా కోట్లాది రూపాయల నష్టం జరిగింది. తమకు న్యాయం చేయాలంటూ వ్యాపారులు ఆందోళన చేశారు.

బాధితులను ఎగ్జబిషన్ సొసైటీ ఆదుకుంటుందని, ప్రభుత్వం నుంచి సాయం అందేలా చర్యలు తీసుకుంటామని ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. 79 ఏళ్ల చరిత్ర కల్గిన నుమాయిష్‌లో భారీ అగ్నిప్రమాదం జరగడం విచారకరమని ఆయన అన్నారు. ప్రమాదంలో నష్టపోయిన వ్యాపారుల కంటే తమకే ఎక్కువ బాధ ఉందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : exhibition reopens  Numaish re-opens  exhibition grounds  Hyderabad  fire break  crime  

Other Articles