టీడీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ షాక్ ఇచ్చింది. సుజనా కంపెనీల్లో గత కొన్ని రోజులుగా సోదాలు నిర్వహిస్తున్న ఈడీ ‘సుజనా గ్రూప్’కు డొల్ల కంపెనీల భరతం పడుతోంది. డొల్ల కంపెనీల మాటున బ్యాంకుల నుంచి పోందిన రుణాలను మళ్లించిన తీరును కూడా అధ్యయనం చేసిన ఈడీ తాజాగా ఆయనకు చెందిన సుజనా కంపెనీకి భారీ షాక్ ఇచ్చింది.
బ్యాంకులను మోసగించిన కేసులో రూ.315 కోట్ల విలువైన వైస్రాయ్ హోటల్స్ ఆస్తులను జప్తు చేసింది. షెల్ కంపెనీల పేరుతో బ్యాంకులకు రూ.364 కోట్ల కుచ్చుటోపీ పెట్టినట్టు గుర్తించిన ఈడీ ఈ మేరకు చర్య తీసుకుంది. మనీ ల్యాండరింగ్ 2002 చట్ట ప్రకారం హైదరాబాద్‌లోని వైస్రాయ్ హోటల్స్ ఆస్తులను అటాచ్ చేసింది. సుజనా చౌదరికి సంబంధించిన షెల్ కంపెనీ నుంచి భారీగా నిధుల బదలాయింపు జరిగినట్లు అధికారులు గుర్తించారు.
బీసీఈపీఎల్ కంపెనీ ద్వారా రూ.364 కోట్ల రుణం తీసుకున్న సుజనా గ్రూప్.. నిధులను పక్కదారి పట్టించినట్లు తెలుస్తోంది. కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేసింది. డొల్ల కంపెనీలు సృష్టించి నకిలీ ఆస్తులు, బోగస్ ఇన్వాయిస్ లతో బ్యాంకులను సుజనా గ్రూప్ బురిడీ కొట్టించినట్టు ఈడీ విచారణలో తేలింది. చైన్నైలోని ఆంధ్రా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని షెల్ కంపెనీలకు తరలించి అక్రమాలకు పాల్పడినట్టు తేలింది.
మహల్ హోటల్ అనే డొల్ల కంపెనీని సృష్టించి దీని నుంచి డబ్బును వైస్రాయ్ హోటల్ లిమిటెడ్‌కు తరలించినట్టు దర్యాప్తులో బయటపడింది. హైదరాబాద్ లోని సుజనా గ్రూప్ కార్యాలయం నుంచి కీలక పత్రాలను ఈడీ అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. డొల్ల కంపెనీలకు చెందిన 124 నకిలీ రబ్బరు స్టాంపులను కూడా గుర్తించారు. షెల్ కంపెనీ ద్వారా భారీ మొత్తంలో డబ్బు బదలాయించినట్లు సీబీఐ గుర్తించింది. బీసీఈపీఎల్ కంపెనీ వ్యవహారాన్ని ఈడీకి సీబీఐకి అప్పగించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more