తెలంగాణ రాష్ట్రంలో సంచలనానికి తెరలేపిన యాద్రాది భువనగిరి జిల్లా హాజీపూర్ లో మర్డర్ మిస్టరీల కేసులో దర్యాప్తులో మరో కలకలం రేగింది. పదో తరగతి విద్యార్థిని శ్రావణి మర్డర్ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులకు దిమ్మతిరిగే నిజాలు తెలుస్తున్నాయి. శ్రావణి మృతదేహం దొరికిన బావిలోనే మరో బాలిక మృతదేహాం తాజాగా లభ్యమైంది. అదే గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని మనీషా నెల రోజుల క్రితం అదృశ్యమైంది. అయితే నెల రోజుల తరువాత ఇవాళ అమె శవం లభ్యంకావడంతో హాజీపూర్ సహా పరిసర ప్రాంతాల్లో భయాందోళన వ్యక్తం అవుతోంది.
శ్రావణి హత్యాచార కేసు విచారిస్తున్న పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఓ అనుమానిత నిందితుడిగా వున్న శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించిన క్రమంలో అతనే భావిలో మరో బాలిక శవాన్ని పూడ్చిపెట్టినట్టు పోలీసులకు తెలిపాడని సమాచారం. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మరోమారు బావి వద్దకు వెళ్లి శవాన్ని వెలికితీసి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మనీష మార్చిలో అదృశ్యమైంది. ఆమె ఏమైంది? ఎక్కడికి వెళ్లింది? అనేది తల్లిదండ్రులు తెలుసుకోలేకపోయారు. చివరికి ఇలా మృతదేహమై కనిపించడంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు షాక్ తిన్నారు. బావిలో ఒక్కొక్కటిగా అమ్మాయిల మృతదేహాలు బయటపడుతుండటం కలకలం రేపుతోంది. మనీషకు ప్రేమ వ్యవహారం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి మనీష తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో తమ కూతురు అబ్బాయితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుని ఉంటుందని కుటుంబసభ్యులు భావించారు. ఎప్పటికైనా ఇంటికి తిరిగివస్తుందిలే అని భావించిన క్రమంలో అమె శవమై కనిపించడంతో అమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
నెల రోజులకు పైగా అమెపై అత్యాచారం, చేసి చంపి పూడ్చిపెట్టడంలో అమె శవం కోసం పోలీసులు తవ్వగా.. అక్కడ మనీషా ఎముకలు మాత్రమే మిగిలాయి. వాటిని ఐదు సంచుల్లో సేకరించి భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ కొన్ని పరీక్షలు చేసి తర్వాత ల్యాబ్ కి పంపిస్తామని పోలీసులు చెప్పారు. ఐడీ కార్డు, అక్కడ లభించిన బ్యాగు ఆధారంగా మృతదేహం మనీషదే అని పోలీసులు గుర్తించారు. సైంటిఫిక్ గా నిరూపించాల్సిన అవసరం ఉండటంతో డీఎన్ఏ టెస్టుకి ఏర్పాట్లు చేస్తున్నారు. తల్లి లేదా తండ్రి డీఎన్ఏతో పోల్చనున్నారు.
ఇదిలావుండగా, హాజీపూర్ గ్రామానికి చెందిన మరో యువతి కల్పన 2015లో అదృశ్యమైంది. అయితే ఈ బాలిక కూడా అత్యాచారానికి గురైందా.? అమెను కూడా నరరూప రాక్షసుడు బలితీసుకున్నాడా.? లేక అమె బతికేవుందా.? అన్న వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. కాగా కల్పన గురించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. ఇదిలావుండగా, హాజీపూర్ కు చెందిన శ్రీనివాస్ రెడ్డి ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసు వర్గాలు అనధికారికంగా నిర్థారించాయి. నిందితుడు కీసరలో బైక్ మెకానిక్ గా పనిచేస్తుంటాడని, అయితే అతనిపై హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో కేసులు వున్నాయని పోలీసుల రికార్డుల్లో తేలింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more