Severe cyclonic storm Fani to impact these places in AP భయంకర పెను తుఫాను ‘ఫణి’ ప్రభావానికి గురైయ్యే ప్రాంతాలివే..

Severe cyclonic storm fani to impact these places in andhra pradesh

IMD, Andhra cyclone alert, TN cyclone alert, cyclone alert tn, IMD cyclone alert, Andhra pradesh fani storm, Andhra pradesh Weather, Andhra pradesh fani, Andhra pradesh storm, Andhra pradesh cyclone alert, Andhra pradesh fani alert, Odisha storm, puducherry storm, odisha weather, odisha fani storm alert, Andhra Pradesh, Politics

In view of cyclone storm Fani intensifying into a ‘Severe Cyclonic Storm’ over the south-east and adjoining south-west Bay of Bengal, high alert issued in Andhra pradesh and odisha.

భయంకర పెను తుఫాను ‘ఫణి’ ప్రభావానికి గురైయ్యే ప్రాంతాలివే..

Posted: 05/01/2019 02:17 PM IST
Severe cyclonic storm fani to impact these places in andhra pradesh

బంగాళాఖాతంలో ఏర్పడిన భయంకర పెను తుఫానుగా రూపాంతరం చెందిన ఫణి దిశమార్చుకుని మయన్మార్, బంగ్లాదేశ్ వైపు పయనిస్తుందన్న వార్త కొంత ఊరటను కల్పించినా.. దాని ప్రభావం మాత్రం ఏపీ, ఒడిశా రాష్ట్రాలపై వుంటుందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం కొనసాగుతోంది. క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా తీరం వైపు కదులుతోంది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొస్తోంది. ఒడిశాలోని పూరీకి 710 కిలోమీటర్లు, విశాఖకు 460 కిలోమీటర్లు, మచిలీపట్నంకి 454 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

ఫణి తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ నుంచి అతిభారీ వర్షాలతో పాటు వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. మరీ ముఖ్యంగా రాష్ట్రంలోని  తుని, అమలాపురం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్టణం, కాకినాడలో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నెల 2వ తేదీ గురువారం అతి భారీ వర్షాలు కూడా ఉంటాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో తీరం వెంబడి గంట‌కు 80- 90 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీచే అవ‌కాశ‌ం ఉంది. మే 3వ తేదీన తుఫాన్ తీరం దాటే సమయంలో కూడా ఆయా జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతాయని వెల్లడించింది.

తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని తెలిపింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెనక్కి వచ్చేయాలని పేర్కొంది. మే 2, 3 తేదీల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది వాతావరణశాఖ. మే 2, 3 తేదీల్లో శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలు ఉన్నాయి. విశాఖ‌ప‌ట్నం జిల్లాలో ఒక మోస్తరు వ‌ర్షాలు కురిసే సూచ‌న‌లు కనిపిస్తున్నాయి. తుఫాను గమనాన్ని రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది.

ప్రభావిత మండలాలు : -


శ్రీకాకుళం జిల్లా:  గార‌, ఇచ్ఛాపురం, క‌విటి, కంచిలి, సోంపేట‌, మంద‌స‌, సంత‌బొమ్మాళి, ప‌లాస‌, పొలాకి, నందిగాం, వ‌జ్రపుకొత్తూరు, శ్రీకాకుళం
విజ‌య‌న‌గ‌రం: భోగాపురం, చీపురుప‌ల్లి, డెంకాడ‌, గ‌రివిడి, గుర్ల‌, నెల్లిమ‌ర్ల‌, పూస‌పాటిరేగ‌
విశాఖ‌ప‌ట్నం:  భీమునిప‌ట్నం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles