vijaya sai reddy took over TRS party's first TV Channel? వైసీపీకి మరో ఛానెల్.. విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో..

Vijaya sai reddy took over trs party s first tv channel

raj news, TRS first news channel, Raj news, komati reddy brothers, vijay sai reddy, YSRCP, TDP, Sakshi, andhra pradesh, Telangana, politics

The Opposition Party Leader of Andhra Pradesh and MP Vijay sai Reddy is an auditor of companies and he even holds few business and stakes in some. Now there is a news doing rounds that he has taken the first channel acquired by TRS party during the movement.

టీఆర్ఎస్ తొలి ఛానెల్ భాధ్యతలు ఇక విజయసాయి రెడ్డికి.?

Posted: 05/11/2019 05:45 PM IST
Vijaya sai reddy took over trs party s first tv channel

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నడుస్తున్న రోజుల్లో అప్పటి మీడియా తమ వార్తలను చూపించడం లేదని, ఉద్యమవార్తలపై సీమాంధ్రులు ఉక్కుపాదం మోపుతూ మీడియాను కట్టడి చేస్తున్నారని, ఆంధ్రపెత్తందారి వ్యవస్థలో మీడియా గోంతు నులిమేస్తున్నారని.. అందుకోసం మన కోసం మన మీడియా వచ్చేసిందని.. ఇక మనవార్తలను మనమే నిష్పక్షపాతంగా వీక్షించవచ్చునని నినందిన తెలంగాణ రాష్ట్ర సమితి నేతల తొలి టీవీ ఛానెల్ అది. అదే రాజ్ న్యూస్. ఉద్యమం ఉప్పెనలా కొనసాగుతున్న తరుణంలో తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన ఛానెల్ రాజ్ న్యూస్ తెలుగు.

అయితే అప్పట్లో ఈ టీవీ చానెల్ ను టీఆర్ఎస్ పార్టీ లీజుకు తీసుకుని నడిపించింది. ఆ తరువాత వారికి సొంతంగా టీ న్యూస్ ఛానెల్ శాటిలైట్ హక్కులు లభించడంతో ఇక రాజ్ న్యూస్ ను వదిలేసింది. అప్పట్నించి స్వతంత్రంగా నడిచిన ఈ ఛానెల్ ఆ తరువాత సరిగ్గా 2014 ఎన్నికలకు ముందుకు బీజేపి నేత కిషన్ రెడ్డి బాసటగా నిలిచింది. ఆ తరువాత స్వయంగా పుంజుకోవడానికి అన్ని ఏర్పాటు జరిగి.. స్వప్న (టీవీ 9 మాజీ జర్నటిస్ట్) సీఈఓగా ఎదిగేందుకు ప్రయత్నించినా.. పలు కారణాలతో కుదరకుండా పోయింది.

ఇక అనేక అవాంతరాల మధ్య చివరకు కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి బ్రదర్స్ చేతికి వెళ్లింది. వైఎస్ మరణానంతరం పార్టీలో తనకు ప్రాధాన్యత కూడా సన్నగిల్లడం.. ఆ తరువాత ఆయన టీఆర్ఎస్ లో చేరుతారన్న వార్తలు రావడంలో.. ఈ నేపథ్యంలో చేతిలో టీవీ ఛానెల్ వుంటే తమపై వచ్చే వార్తలకు ఖరాఖండీగా సమాధానం ఇవ్వచ్చని భావించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తమ విజయానికి దోహదపడటంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఛానెల్ నిర్వహణ పెద్ద కష్టం కాదని భావించారు బ్రదర్స్.

అయితే రాజగోపాల్ రెడ్డి గెలిచినా.. వెంకట్ రెడ్డి ఓటమి పాలు కావడం.. ఇక సార్వత్రిక ఎన్నికలలో మరోమారు ఆయన ఎంపీగా పోటీ చేయడం.. ఇలా అన్ని వెరసి ఆయనకు కూడా అర్థిక ఇబ్బందులు తలెత్తాయని సమాచారం ఈ నేపథ్యంలో భారంగా మారిన ఛానెల్ నిర్వహణను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు కోమటి రెడ్డి బ్రదర్స్. అయితే అందివచ్చిన టీవీ చానెల్ అన్నింటినీ తమ ఖాతాలోకి వేసుకోవాలని మరోవైపు వైసీపీ పార్టీ ప్రయత్నాలు సాగిస్తుంది. ఈ క్రమంలో వైసీపీ నేత విజయ్ సాయి రెడ్డి చేతికి రాజ్ న్యూస్ వెళ్లిందన్న టాక్ వినిపిస్తోంది.

అయితే తెలంగాణ ప్రజలకు మాత్రేమే సుపరిచితమైన ఈ ఛానెల్ ను విజ‌య‌సాయిరెడ్డి ప‌ర్య‌వేక్షిణలో రన్ చేయడానికి ఇప్పటికే రాజ్ న్యూస్ యాజమాన్యం నుంచి అంగీకారం పోందారన్న వార్తలు వినిపిస్తున్నాయి. రాజ్ న్యూస్ గ్రూప్ అప్ ఛానెల్స్ తమిళనాడుకు చెందినది. దీంతో వారితో అంగీకార ఒప్పందం మేరకు ఇక్కడ విజయ్ సాయి రెడ్డి ఆద్వర్యంలో ఛానెల్ నిర్వహణ చేపట్టనున్నారు. ఇంతవరకు బాగానే వున్నా.. గత ఐదేళ్లుగా తెలంగాణ ప్రజలకు దూరంగా వున్న వైసీపీ పార్టీ.. ఇక తన బలం పుంజుకునేందుకు తెలంగాణ ప్రజలకు పరిచమున్న ఛానెల్ తోనే వస్తుందా.? అన్న అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.

తెలంగాణలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు అనేకమంది వున్నారని.. వారిని మళ్లీ ఒక్కటిగా క్రోడీకరించి.. ఇక తెలంగాణలోనూ 2023 టార్గెట్ గా వైసీపీ నేతలు అడుగులు వేస్తున్నారా.? అన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. తెలంగాణలో గత ఎన్నికల తరువాత వైసీపీ తన ఉనికి కోల్పోయింది. కానీ రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి తమ బాలన్ని పుంజుకుని వైఎస్ అభిమానులను, జగన్ ఫాన్స్ ను తట్టి లేపి తమ సత్తా చాటుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలలో భాగంగానే రాజ్ న్యూస్ నిర్వహణ అందుకోవడమా.? అన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఓ వైపు వైఎస్ అభిమానులు ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raj news  komati reddy brothers  vijay sai reddy  YSRCP  TDP  Sakshi  andhra pradesh  politics  

Other Articles