OFRC to recruit 4805 apprentice posts ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 4805 ఉద్యోగాల భర్తీ..

Ordnance factory recruitment centre to recruit 4805 apprentice posts

OFB, Ordnance Factory Board, OFRC Recruitment, OFB Recruitment, OFB Apprentice recruitment, OFB recruitment, OFB Apprentice, ofb.gov.in, Ordnance Factory Board, Govt jobs, Vacancy, sarkari naukri

The Ordnance Factory Recruitment Centre (OFRC) of Ordnance Factory Board (OFB) has issued a notification saying that it will invite online applications to fill about 4,805 vacancies of trade apprentices in Ordnance and Ordnance Equipment Factories across India.

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 4805 ఉద్యోగాల భర్తీ.. అప్రెంటీస్ నోటిఫికేషన్

Posted: 10/31/2019 01:40 PM IST
Ordnance factory recruitment centre to recruit 4805 apprentice posts

నిరుద్యోగులకు మరో శుభవార్త. రక్షణ శాఖకు చెందిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు-OFB భారీగా ఉద్యోగాల భర్తీ చేపడుతోంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డుకు చెందిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ రిక్రూట్‌మెంట్ సెంటర్-OFRC మొత్తం 4,805 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించి ప్రస్తుతం షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. షార్ట్ నోటిఫికేషన్‌లోని వివరాల ప్రకారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ స్కిల్ ఇండియా మిషన్‌లో భాగంగా 4805 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనుంది.

వీటిలో నాన్-ఐటీఐ అప్రెంటీస్ పోస్టులతో పాటు ఐటీఐ అప్రెంటీస్ పోస్టులు కూడా వున్నాయి. ఈ రెండు కేటగిరీలో 56వ బ్యాచ్ ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల్ని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ రిక్రూట్‌మెంట్ కేంద్రం భర్తీ చేస్తోంది. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఆర్డినెన్స్ & ఆర్డినెన్స్ ఎక్యూప్‌మెంట్ ఫ్యాక్టరీల్లో వీరిని నియమించనుంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి రిలీజ్ చేసిన OFRC Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...

* మొత్తం అప్రెంటీస్ ఖాళీలు- 4805
** నాన్-ఐటీఐ అప్రెంటీస్ పోస్టులు- 1595
** ఐటీఐ అప్రెంటీస్ పోస్టులు- 3210
విద్యార్హత-
* నాన్ ఐటీఐ కేటగిరీ పోస్టులకు 10వ తరగతి లేదా తత్సమాన పరీక్ష 50% మార్కులతో పాస్ కావాలి. మ్యాథ్స్, సైన్స్‌లో 40% మార్కులు ఉండాలి.
* ఐటీఐ కేటగిరీ పోస్టులకు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
* వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు.
ఈ ఉద్యోగాలకు సంబంధించి డీటెయిల్డ్ నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు-OFB అధికారిక వెబ్‌సైట్‌ http://www.ofb.gov.in ఓపెన్ చేసి ‘News & Announcements’ సెక్షన్ లో నోటిఫికేషన్‌ రిలీజ్ అవుతుంది. దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ చివరి వారంలో ప్రారంభమయ్యే అవకాశముంది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ఫాలో అవుతుండాలి.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles