ఆపరేషన్ డాల్ఫిన్ నోస్ పేరుతో జాతీయ దర్యాప్తు ఏజెన్సీ ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న కేసులో మరిన్నీ అసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐ విసిరిన వలపు వలలో చిక్కుకుని వారికి భారత భద్రతా రహస్యాలను చేరవేసిన నేవీ ఉద్యోగుల కేసును జాతీయ దర్యాప్తు బృందం ఇన్వెస్టిగేషన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్ఐఏ ఎంట్రీతో ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. వలపు వలలో చిక్కుకోవడంతో పాటు అధిక డబ్బును కూడా ఆశచూసిన ఐఎస్ఐ వారి నుంచి రహస్యాలను తెలుసుకుందన్న విషయం తెలసిందే.
అయితే ఈ డబ్బు ఎలా నేవీ ఉద్యోగులకు అందిందన్న విషయమై దర్యాప్తు సాగిస్తున్న క్రమంలో.. నేవి ఉధ్యోగుల వేతన ఖాతాలల్లోకే హవాలా మార్గంలో ఈ డబ్బు వచ్చి చేరినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. నేవి ఉధ్యోగలతో పాటు, వారి సన్నిహితులు, బంధువుల ఖాతాల్లో పెద్ద ఎత్తున పాకిస్థాన్ డబ్బులను జమ చేసిందని తేల్చారు. ముంబయి కేంద్రంగా హవాలా వ్యాపారం నడిపిస్తున్న ఇండియాజ్ సయ్యద్, షేస్ సాహిస్థాలు, పాక్ నుంచి వచ్చే డబ్బును ఉద్యోగుల ఖాతాల్లోకి చేర్చారని అధికారులు తేల్చారు.
తాము చేస్తున్నది తప్పని, ఉగ్రదాడులకు సన్నాహకాలు జరుగుతుంటే, వాటిల్లో తాము కూడా భాగస్వాములం అవుతున్నామని ఉద్యోగులకు తెలుసునని అధికారులు పేర్కోన్నారు. ఈ నెల 18 నుంచి 22 వరకూ పలువురు ఉద్యోగులను కస్టడీలోకి తీసుకుని విచారించగా, కొందరు వెనువెంటనే తమ నేరాన్ని అంగీకరించగా, కొందరు మాత్రం ఆలస్యంగా తప్పును అంగీకరించారని సమాచారం. ఇక నిందితులంతా, తమకు పరిచయం అయిన అందమైన అమ్మాయిలపై మోజుతో, ఫేస్ బుక్, ఈ-మెయిల్ మాధ్యమంగా వారితో మాట్లాడారని, వారికి దేశ రహస్యాలు చేరవేశారని ఎన్ఐఏ గుర్తించింది.
ఇక ఎటువంటి సమాచారాన్ని పాక్ కు ఉద్యోగులు చేరవేశారన్న అంశంపై అధికారులు లోతైన విచారణ జరుపుతున్నారు. దీంతో ఇకపై నేవి ఉద్యోగులు సోషల్ మీడియాను వినియోగించరాదని కూడా తాజాగా ఉత్తర్వులు జారీ అయిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ ఈ కేసులో 13 మందిని నిందితులుగా ఎన్ఐఏ అరెస్ట్ చేయగా, వీరిలో 11 మంది నేవీ ఉద్యోగులు, ఇద్దరు హవాలా ఆపరేటర్లు ఉన్నారు. వీరంతా 25 సంవత్సరాల వయసులోపున్న వారే కావడం గమనార్హం. వీరంతా వాట్స్ యాప్ ద్వారా యుద్ధ నౌకలు, సబ్ మెరైన్ల కదలికలను ఐఎస్ఐకి పంపారని, నేవీ స్థావరాల చిత్రాలు, వీడియోలను కూడా పంపారని అధికారులు తేల్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more