Ruckus in a pub, Rahul Sipligunj attacked రాహుల్ సిప్లిగంజ్ పై దాడి.. పథక రచనలో భాగమేనా.?

Singer big boss winner rahul sipligunj assaulted by gang at cyberabad pub

Rahul Sipligunj, Gachibowli, TRS MLA Pilot Rohit Reddy, MLA Rohit Reddy cousin ritesh reddy, Nandishwar Goud, Rahul Girl Friend, PUB Attack, Prism PUB, Bigg Boss 3 Telugu, Madhapur, Cyberabad, Crime, Telangana Politics

Noted Tollywood singer and Big Boss 3 season winner Rahul Sipligunj was allegedly attacked by a group of persons during a drunken brawl at Prism pub late on Wednesday night in Gachibowli of Cyberabad. The attackers believed to be close relatives of an MLA from Vikarabad district.

ITEMVIDEOS: రాహుల్ సిప్లిగంజ్ పై దాడి వారి పనేనా.? పథక రచనలో భాగమేనా.?

Posted: 03/05/2020 11:10 AM IST
Singer big boss winner rahul sipligunj assaulted by gang at cyberabad pub

బిగ్‌బాస్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌ పై పథకం ప్రకారమే దాడి జరిగిందా.? బిగ్ బాస్ షో విన్నర్ గా ఆయనకు లభించిన పాపులారిటీ.. ఫ్యాన్ ఫాలోయింగ్ సహా యువతుల్లోనూ క్రేజ్ ఏర్పడిందని, దీనిని జీర్ణించుకోలేని వ్యక్తులు కావాలని ఆయన రెగ్యూలర్ గా వచ్చే పబ్ లో తిష్ట వేసి.. పథకం ప్రకారమే దాడి చేశారా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ దాడిలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి.. జెండా తిప్పేసిన తాండూరు ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రంజిత్ రెడ్డి అదేశాలతోనే జరిగిందన్న అరోపణలు వస్తున్నాయి.

రంజిత్ రెడ్డి మిత్రులే దాడికి కారణమయ్యారని, ఒక దశోలో రంజిత్ రెడ్డి కూడా రాహుల్ సిప్లిగంజ్ పై బీరుబాటిళ్లతో దాడి చేశారన్న కూడా సమాచారం. అప్పటికే తీవ్ర రక్తస్రావం అవుతున్నా శాంతించని రంజీత్ రెడ్డి వర్గీయులు.. రాహుల్ ముఖంపై కూడా పిడిగుద్దులు విసిరారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రాహుల్ ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. గత రాత్రి 11:45 గంటల ప్రాంతంలో రాహుల్ తన స్నేహితులు, ఓ గాళ్ ఫ్రెండ్ తో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్‌కు వెళ్లాడు.

ఆ సమయంలో అక్కడున్న కొంతమంది యువకులు రాహుల్‌ వెంట వున్న యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. రాహుల్ కలగజేసుకోవడంతో వాగ్వివాదం మొదలైంది. అది మరింత ముదరడంతో ఇరు వర్గాలు దాడులకు దిగాయి. ఈ క్రమంలో పబ్ బౌస్సర్లు ఇరువర్గాలను శాంతింపజేసుందుకు ప్రయత్నించినా.. రెండు వర్గాలు ఆగలేదు. రంజిత్ రెడ్డి వర్గానికి చెందిన కొందరు యువకులు రాహుల్‌ తలపై బీరు సీసాలతో దాడికి దిగారు. తీవ్ర రక్తస్రావమైన రాహుల్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మరి అధికార ఎమ్మెల్యే తమ్ముడి విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందా.? లేక తరుణోపాయాల కోసం మైండ్ గేమ్ అడుతుందా వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles