వదువరులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా తమ బిడ్డల కల్యాణమంటే ఎంతో సంబరంగా చేయాలని భావించే ఓ ఘనమైన పండుగ. బందుమిత్రులందరితో కలసి అట్టహాసంగా, కనువిందుగా, ఎంతో సరదాగా చేయాల్సిన కార్యక్రమం. ఈ తంతుతో తమ కొడుకుపైన తమ పూర్తి బాధ్యతను వదులుకునే తల్లిదండ్రులు వారు వదులుకునే భాగాన్ని అతని అర్థాంగికి అప్పగిస్తారు. ఇక అమ్మాయి ఇంటివారైతే తమ కూతురి పూర్తిబాధ్యతను వరుడి చెతికి అప్పగించేస్తారు. బంధుమిత్రుల మధ్య, వేదమంత్రోచ్చరణ మధ్య,ఫంప్రదాయాల ప్రకారం రంగరంగ వైభవంగా జరుగుతుందీ కార్యక్రమం.
అలాంటి కళ్యాణవేడుకలను కరోనా వైరస్ ప్రభావంతో ఆకాశమంత పందిరి.. భూదేవి అంత ముగ్గులా కాకుండా అత్యంత తక్కువ మందితో మమ అని అనిపించామా అన్నట్లుగా సాగుతున్నాయి. ఇక మరికొందరైతే ఏకంగా తమ సంతానం పెళ్లిళ్లను వాయిదా కూడా వేసుకున్నారు. పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయంటే అందుకు కారణం కరోనా వైరస్సే. ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పలు దేశాలకు తూర్పు, మధ్యప్రాశ్చ, అగ్రరాజ్యం, ఈశాన్య రాష్ట్రాల నుంచి విమానాల రాకపోకలపై నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి.
సరిగ్గా ఇలాంటి పరిణామాలు ఉత్పన్నం కావడంతో బంధుమిత్రుల మధ్య చేసుకోకపోయినా పర్వాలేదు.. కనీసం తల్లిదండ్రుల మధ్య తన కాబోయే భార్య మెడలో తాళి కట్టి తనదాన్ని చేసుకోవాలని కలలు గన్న ఓ వరుడి అశలు అడియాశలయ్యాయి. అయితే మతపెద్దల అనుమతితో చివరకు అంతర్జాలంలో వారిద్దరి వివాహం జరిగిపోయింది. అదెలా అంటే.. విమానాలు రద్దవడంతో ఎంతో మంది మాదిరిగా పెళ్లి కావాల్సిన వరుడు కూడా మారిషస్ లో నిలిచిపోగా, ముహూర్తం మించిపోతుండడంతో కుటుంబసభ్యులు వీడియో కాల్ సాయంతో పెళ్లి చేశారు.
వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ లోని అంటాచౌరాహే ప్రాంతానికి చెందిన తౌసిఫ్ మారిషస్ లో ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. అతనికి షాజహాన్ పూర్ కు చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 19న వివాహ ముహూర్తం నిర్ణయించారు. అయితే మారిషస్ నుంచి భారత్ కు విమానాలు రద్దు చేయడంతో తౌసిఫ్ అక్కడే నిలిచిపోయాడు. దాంతో ఇరు కుటుంబాల వారు వీడియో కాల్ తో పెళ్లి చేయాలని భావించారు. ఈ క్రమంలో తౌసిఫ్ కుటుంబసభ్యులు షాజహాన్ పూర్ లోని వధువు ఇంటికి వెళ్లి పెళ్లి సమ్మతమేనంటూ ఆమెతో అంగీకార పత్రంపై సంతకం చేయించుకున్నారు. ఆపై, వీడియో కాల్ ద్వారా తౌసిఫ్ తో నిఖా జరిపించారు. పరిస్థితి కుదుటపడిన తర్వాత తౌసిఫ్ వస్తే అతడికి అమ్మాయిని అప్పగిస్తామని బంధువులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more