People with O blood group protective COVID risk: Researches కరోనా వైరస్ ప్రభావం వీరిపైన ఎక్కువ.. వీరిపై తక్కువే..

People with a blood group at higher covid risk o group protective researches

A blood group, COVID, O blood group, ABO blood group, coronavirus, blood groups and covid, O-negative, O-positive, A-negative, A-positive, AB-negative, AB-positive, coronavirus risk A blood group, coronavirus O blood group protective

According to the preliminary data collected by 23andMe, people with O blood group (O-negative and O-positive) are protective against the coronavirus. While blood group A (A-positive, A-negative and AB-positive, AB-negative) was associated with a higher risk.

కరోనా వైరస్ ప్రభావం వీరిపైన ఎక్కువ.. వీరిపై తక్కువే..

Posted: 06/12/2020 12:34 AM IST
People with a blood group at higher covid risk o group protective researches

కరోనా వైరస్ మహమ్మారి గత ఐదు నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వైద్యులు దీనికి చికిత్సను ఎలా అందించాలన్న విషయంలో పరిశోధనలు సాగిస్తుండగా, వైద్యరంగంతో పాటు భయో మెడికల్ రంగానికి చెందిన శాస్త్రవేత్తలు.. బయో్ కెమిస్ట్ర్టీ నిపుణులు, కరోనా వైరస్‌ కు మందును కనిపెట్టే ప్రయత్నంలో వున్నాడు, ఇక మరికొందరు కరోనాకు వ్యాక్సిన్‌ కనిపెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఐదు మాసాలు కాసింత ఎక్కువ సమయమే అయినా.. ఇప్పటి వరకు కరో్నాకు మందును కనిపెట్టలేదు సరికదా.. వాక్సీన్ ను తీసుకురాలేకపోయారు.

అగ్రరాజ్యాలుగా బాసిల్లుతున్న దేశాలు అనేకం కలసి ప్రయోగాలు చేస్తున్నా.. కరోనాను కట్టడి చేయలేకపోతున్నారు. వాక్సీన్ కొన్ని తొలిదశ దాటినా. ఇంకా ట్రయిల్స్‌ దశలోనే వున్నాయి. అయితే విజయవంతమైన వ్యాక్సిన్ బయటకు ఎప్పుడు వస్తుందన్న విషయం మాత్రం ఇంకా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో పలు దేశాలు కరోనా విషయంలో మనుషులు ఎదుర్కోనే తీరును అందుకు వారి శరీరంలోని రోగనిరోధక శక్తి ఎలా పనిచేస్తుందన్న విఫయమై కూడా పరిశోధనలు సాగిస్తున్నారు. అయితే కొందరిలో మాత్రం కరోనా సోకినప్పటికి ఎటువంటి లక్షణాలు కనిపించడం లేదు. ఈ విషయాన్ని ఆధారంగా చేసుకుని పలు సంస్థలు పరిశోధనలు ప్రారంభించాయి.

కరోనా వైరస్ సోకిన అందరిలో ఒకే రకమైన లక్షణాలు ఎందుకు కనిపించడం లేదు? అనే అంశంపై 23అండ్‌మీ అనే జెనెటిక్ టెస్టింగ్‌ సంస్థ కూడా అధ్యయనం జరుపుతోంది. జన్యు శాస్త్రానికి సంబంధించిన ఈ అధ్యయనం ఇంకా పూర్తి కానప్పటికి.. ప్రిలిమినరీ ఫలితాల్లో తమకు ఓ విషయం తెలిసినట్టు సంస్థ చెబుతోంది. కరోనా బారిన పడుతున్న వారిలో ‘ఓ’ బ్లడ్ గ్రూప్ వారు తక్కువగా ఉన్నట్టు సంస్థ సోమవారం వెల్లడించింది. మిగతా బ్లడ్ గ్రూప్‌లతో పోల్చితే ఓ బ్లడ్ గ్రూప్ కలిగిన వారిలో 9 నుంచి 18 శాతం మంది కరోనా బారిన తక్కువగా పడుతున్నారని సంస్థ తెలిపింది. దాదాపు 8 లక్షల మందిపై చేసిన అధ్యయనంలో ఈ విషయం తెలిసిందన్నారు.

అయితే తమ అధ్యయనంలో పూర్తి ఫలితాలు ఇంకా రాలేదని.. ఇవి కేవలం ప్రారంభ స్థాయిలో వచ్చిన ఫలితాలని సంస్థ పేర్కొంది. ఇదిలా ఉండగా.. మార్చిలో మరో అధ్యయనంలో కూడా సరిగ్గా ఇటువంటి ఫలితాలే వచ్చాయి. ఈ అధ్యయనంలో టైప్ ఓ బ్లడ్ గ్రూప్ కలిగిన వారు తక్కువ సంఖ్యలో కరోనా బారిన పడితున్నారని వారిలో కరో్నాను ఎదుర్కోనేందుకు కొంత శక్తి వారి బ్లడ్ గ్రూప్ కల్పిస్తో్ందని తేల్చింది. అదే సమయంలో టైప్ ఏ బ్లడ్ గ్రూప్ కలిగిన వారు కరోనాను ఎదుర్కోవడంలో శక్తిహీనులుగా వున్నారని అందుకు వారి బ్లడ్ గ్రూప్ సహకరించడం లేదని తేల్చింది. దీంతో పాటు ఏబి బ్లడ్ గ్రూప్ కలిగిన వారు కూడా కరోనాను ఎదర్కోవడంలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపింది. ఇక ఏ, ఏబి గ్రూపులకు చెందిన వారే ఎక్కువగా కరోనా మరణాలుగా నమోదవుతున్నాయి తేలిందని అద్యయనం చెబుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : A blood group  COVID  O blood group  ABO blood group  coronavirus  blood groups and covid  

Other Articles