కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఇటీవలే టెలీ మెడిసిన్ సహా వరుసగా ఎనమిది సంవత్సరాలు భీమా కట్టిన వారి క్లెయిమ్ లను భీమా సంస్థలు సవాల్ చేయకుండా పలు సవరణలను తీసుకువచ్చింది. కాగా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ చేసిన సూచనలు, సలహాలతో దేశంలోనే హెల్త్ ఇన్సూరెన్స్ అగ్రగామి ఇన్యూరెన్స్ సంస్థ ఐసీఐసీఐ లాంబార్డ్ తమ హెల్త్ ఇన్యూరెన్స్ పాలసీల్లో పలు మార్పులను తీసుకువచ్చింది. కొత్తగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకునే వారికి వెయిటింగ్ పిరియడ్ ను నెల రోజుల నుంచి 15 రోజులకు తగ్గించినట్లు ప్రకటించింది.
అయితే ఈ వెయిటింగ్ పిరియడ్ అన్ని వ్యాధులకు కాకుండా కేవలం కరోనావైరస్ బాధితులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. మిగతా వ్యాధులకు 30 రోజుల నిర్ణీత వ్యవధి నిబంధన యధావిధిగా వర్తిస్తుందని పేర్కొంది. ఇక దీంతో పాటు ఏదైనా అనారోగ్యం బారినపడి, ఇంట్లోనే ఉండి చికిత్స చేయించుకోనే వారికీ క్లెయిమ్ లను వర్తింపజేయనున్నామని తెలిపింది. హోం హెల్త్ కేర్ బెనిఫిట్ కింద చికిత్స ఖర్చులను కేవలం పక్షం రోజుల వ్యవధిలో చెల్లించనున్నట్లు తెలిపింది. దీని ద్వారా సోషల్ డిస్టెస్సింగ్ పాటించడం అనివార్యమైందని, దీంతో ఆసుపత్రులలో చేరకుండా పాలసీదారులు ఇంట్లో వుంటూనే చికిత్స చేయించకోవచ్చునని చెప్పింది. అయితే, మార్చి 31కి ముందు పాలసీలు తీసుకున్న వారికే ఇది వర్తిస్తుంది.
సంస్థ అందిస్తోన్న కంప్లీట్ హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ బూస్టర్, హెల్త్ కేర్ ప్లస్ లతో పాటు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలన్నింటిలోనూ కొవిడ్-19 చికిత్సకు పరిహారం ఇస్తున్నట్లు పేర్కొంది. దీనికోసం ఎలాంటి అదనపు ప్రీమియం వసూలు చేయడం లేదని వెల్లడించింది. కంప్లీట్ హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ బూస్టర్ ప్లాన్లను ఎంచుకున్న వారు కొవిడ్-19 చికిత్సకు పాలసీని వాడుకున్నా.. ‘నో క్లెయిం బోనస్’ పై ఎలాంటి ప్రభావం ఉండదని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ మంత్రి తెలిపారు. కరోనాకు పరిహారం ఇస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ప్రీమియం పేంచే ఆలోచనేమీ లేదని పేర్కొన్నారు. కరోనా కోసం ప్రత్యేకంగా ఇప్పటికే కొవిడ్-19 ప్రొటెక్షన్ కవర్ ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. కొత్తగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారికి సులభంగా పాలసీ అందేలా చర్యలు చేపట్టామని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more