(Image source from: Dnaindia.com)
కొవిడ్-19 వైరస్ ఎంతటి ప్రమాదకారి వైరస్ ఇప్పటికే ప్రపంచవ్యాప్త ప్రజలకు అవగతమైంది. ఇంతలా ఎలా విస్తరిస్తోందన్న అలోచనలతో శాస్త్రవేత్తల పరిశోధనలు సాగాయి. ఫలితంగా 32 దేశాలకు చెందిన 239 మంది వైద్య నిపుణుల బృందం.. ఈ మహమ్మారి గాలి నుంచి కూడా సోకుతుందని అందుకు తమ వద్ద ఆధారాలు కూడా వున్నాయిని ప్రపంచ ఆరోగ్య సంస్థకు లేఖ రాశారు. గాలి నుంచి కరోనా వ్యాధి సంక్రమిస్తుందని చెప్పడానికి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న దాంట్లో నిజం లేదని కూడా వైద్య నిపుణుల బృందం లేఖలో పేర్కోంది. అయితే శాస్త్రవేత్తల బృందం రాసిన లేఖ నేపథ్యంలో ప్రపంచ అరోగ్య సంస్థ తమ వాదనను ఉపసంహరించుకుంది. అంతేకాదు.. గాలి నుంచి కరోనా వైరస్ సోకుతుందన్న వాదనలను కొట్టిపారేయలేమని కూడా అంగీకరించింది.
గాలి నుంచి కరోనా సంక్రమిస్తుందన్న ఆధారాలను పరిగణలోకి తీసుకున్న డబ్యూహెచ్ఓ మరింత పక్కగా ఆధారాల కోసం తాము ప్రయత్నిస్తున్నామని పేర్కోంది. జనసామర్థ్యం అధికంగా వున్న ప్రాంతాల్లో, గాలి, వెలుతురు సరిగ్గా లేని ప్రాంతాల్లో గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న వాదనలను కోట్టిపారేయలేమని చెప్పింది. అయితే దీనికి సంబంధించి మరిన్ని ఆధారాలను సేకరించి విశ్లేషించాల్సి వుందని అన్నారు, ఆ దిశగా తమ ప్రయత్నాలు సాగుతున్నాయని అన్నారు. గాలి ద్వారా, చిన్న చిన్న తంపర్ల ద్వారా వైరస్ వ్యాపిస్తుందన్న వాదనపై చర్చిస్తున్నామని అన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో సమీక్షించిన తరువాత మార్గదర్శకాల సవరణపై త్వరలో ఓ ప్రకటన చేస్తామని వెల్లడించారు.
గాలి ద్వారా వ్యాపిస్తుందన్న శాస్త్రవేత్తల వాదన డబ్ల్యూహెచ్‌వోతో విభేదించడం కాదని బృందంలో ఓ సభ్యుడైన కొలరెడో విశ్వవిద్యాలయానికి చెందిన రసాయన రంగ నిపుణుడు జోస్ జిమెనెజ్ అన్నారు. ఈ వాదనను పరిగణించాలని మాత్రమే తాము కోరినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే లేఖ రాశామని తెలిపారు. అనేక చర్చల తర్వాత కూడా డబ్ల్యూహెచ్‌వో మా ఆధారాల్ని అంగీకరించడానికి నిరాకరించడంతో బహిరంగ లేఖ రాయాల్సి వచ్చిందని వివరించారు. అయితే, గాలి ద్వారా, అతి చిన్న తుంపర్ల కారణంగా వైరస్ వ్యాపిస్తుందన్న వాదనను వైద్య వర్గాలు అనాదిగా వ్యతిరేకిస్తూ వస్తున్నాయని తెలిపారు. ఈ వాదన రుజువు చేయడానికి బలమైన ఆధారాలు చూపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more