మనుషులతో మనుషులకు అనుబంధాలు సన్నగిల్లుతున్నా.. కొన్ని వస్తువులు, ఇళ్లతో మాత్రం బంధాలను పెనవేసుకుంటాం. ఇక అలాంటి ఇల్లు తమకు కలసివచ్చిందని భావిస్తే.. ఎన్ని వ్యయప్రయాసలైనా పడి అదే ఇంట్లో వుండేందుకు అమితాసక్తిని చూపుతాం. అలా గత 23 ఏళ్లుగా ఒకే నివాసంలో వుంటున్న కాంగ్రెస్ అగ్రనేత, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటిని ఖాళీ చేసి వెళ్లాల్సి వస్తున్న తరుణంలో అమె కుటుంబానికి ఆసరాను ఇచ్చిన ఇంటిలోకి రానున్న మరో ఎంపీని అమె మర్యాదపూర్వకంగా కుటుంబసమేతంగా తన ఇంటికి ఆహ్వనించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఢిల్లీలోని లోధీ ఎస్టేట్ బంగళాలో సుమారు పాతికేళ్ల అనుబంధాన్ని పెనువేసుకున్న ఇంటిని ప్రియాంకా గాంధీ తాజాగా కేంద్రం జారీ చేసిన ఆదేశాల మేరకు ఖాళీ చేయాల్సివస్తోంది. ఆగస్టు ఒకటో తేదీ లోపు తన బంగళాను ఖాళీ చేయాలని తాజాగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలలో పేర్కోంది. దీంతో అందుకు సమ్మతించిన ఆమె హర్యానుకు బయలుదేరి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ప్రియాంక ప్రస్తుతం నివసిస్తున్న బంగళాను బీజేపీ రాజ్యసభ సభ్యుడు అనిల్ బలూనికి కేంద్రం కేటాయించింది. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ టీ తాగేందుకు రావాలంటూ బలూనిని ఆహ్వానించారు. భార్యతో కలిసి తేనీటి విందుకు రావాలంటూ కోరారు.
ఈ మేరకు పార్లమెంటు సభ్యుడికి ఫోన్ చేసిన ప్రియాంక గాంధీ.. ఆయన కార్యాలయానికి లేఖ కూడా పంపారు. అయితే, బలూని నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి సమాధానం లేదని సమాచారం.ప్రియాంక గాంధీ 1997 నుంచి ఢిల్లీలోని లోధీ ఎస్టేట్ బంగళాలోనే ఉంటున్నారు. ఆమెకు కల్పిస్తున్న ఎస్పీజీ భద్రతను కేంద్రం ఇటీవల ఉపసంహరించుకుంది. దీంతో బంగళాను ఖాళీ చేయాల్సిందిగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రియాంకకు నోటీసులు పంపింది. దీంతో బంగళాను ఖాళీ చేస్తున్న ప్రియాంక హరియాణలోని గురుగ్రామ్‌కు తన నివాసాన్ని మార్చనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more