Unnao: Two Dalit girls found dead in a field ఉన్నావ్ లో ఇద్దరు దళిత బాలిక అనుమానాస్పద మృతి..

2 minor dalit girls found dead in unnao field cousin critical police suspect poisoning

unnao, dalit girls unnao, minor girls unnao, Komal, Kajal, Roshni, dalit girls unnao, Uttar Pradesh, Politics, Crime

Two minor Dalit girls were declared brought dead in hospital and another was in a serious condition after they were found in an unconscious state in a field in a village in Asoha block of Unnao district in eastern Uttar Pradesh, police said.

ఉన్నావ్ లో దారుణం.. ఇద్దరు దళిత బాలిక అనుమానాస్పద మృతి..

Posted: 02/18/2021 03:28 PM IST
2 minor dalit girls found dead in unnao field cousin critical police suspect poisoning

ఉత్తర్ ప్రదేశ్ మరో దారుణం జరిగింది. అందునా దళిత యువతిపై స్థానిక బీజేపి ఎమ్మెల్యే అత్యాచారానికి పాల్పడిన కేసుతో సంచలనంగా మారిన ఉన్నావ్.. లో మారుమారు అదే దళిత బాలికలు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం పెనుసంచలనంగా మారింది. పశుగ్రాసం కోసం స్థానికంగా ఉండే అడవిలోకి వెళ్లిన చిన్నారులు.. అపస్మారక స్థిలో వుండటం కలకలం రేపింది. హుటాహుటిన వీరిని అసుపత్రకి తరలించగా, వారిలో ఇద్దరు దళిత బాలికలు అనుమానాస్పద స్థితిలో మరణించారు. మరో బాలిక కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది.

ఘటనా స్థలంలో వారి కాళ్లూచేతులు కట్టిపడేసి ఉన్నాయని, అవి ముమ్మాటికీ హత్యలేనని వారి తరఫు బంధువులు, గ్రామస్థులు ఆరోపిస్తుండగా, పోలీసులు మాత్రం విష ప్రయోగం జరిగిన ఆనవాళ్లున్నాయని తెలిపారు. పశు గ్రాసం కోసం ముగ్గురు బాలికలు సాయంత్రం 3 గంటల ప్రాంతంలో వారి పొలానికి వెళ్లారని ఉన్నావ్ ఎస్పీ ఆనంద్ కులకర్ణి తెలిపారు. అయితే, సాయంత్రమైనా వారు ఇంటికి తిరిగిరాకపోవడంతో, వెతుక్కుంటూ పొలానికి వెళ్లిన కుటుంబ సభ్యులకు  అచేతన స్థితిలో పడి ఉన్న అమ్మాయిలు కనిపించారన్నారు. వారి ఫిర్యాదు మేరకు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నామని, అప్పటికే వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారని తెలిపారు.

అయితే, 13, 16 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలికలు అప్పటికే చనిపోయినట్టు వైద్యులు చెప్పారని, 17 ఏళ్ల వయసున్న మరో బాలికకు చికిత్స చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందన్నారు. దీంతో వెంటనే ఆమెను కాన్పూర్ రీజెన్సీ ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారని వివరించారు. అందరి వాదనలను పరిగణనలోకి తీసుకుని కేసును దర్యాప్తు చేస్తామని కులకర్ణి చెప్పారు. ప్రాథమిక ఆధారాలను బట్టి వారి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవన్నారు.

కుటుంబ సభ్యులు ఇవి ముమ్మాటికీ హత్యలేనని ఆరోపించారు. తాము ఘటనా స్థలానికి వెళ్లేసరికి ముగ్గురి కాళ్లూచేతులు కట్టిపడేసి ఉన్నాయని, పరిస్థితి విషమంగా ఉన్న అమ్మాయి మెడను చున్నీతోనూ బిగించారని గ్రామస్థులు చెబుతున్నారు. వారి నోటి వెంట నురగలు వచ్చాయన్నారు. అయితే, ఇప్పుడే ఆ విషయాన్ని నిర్ధారించలేమని లక్నో రేంజ్ ఐజీ లక్ష్మి సింగ్ తెలిపారు. కాగా, మూడో బాలికకు మెరుగైన చికిత్సను అందించాలని, వెంటనే ఢిల్లీ ఎయిమ్స్ కు ఆమెను తరలించాలని భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. దేశంలో నానాటికీ దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. ఇలాంటి అరాచకాలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : unnao  dalit girls unnao  minor girls unnao  Komal  Kajal  Roshni  dalit girls unnao  Uttar Pradesh  Politics  Crime  

Other Articles