మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై అవినీతి అరోపణలు ఓ వైపు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తుండగానే.. ఇవాళ రాజ్యసభనూ కుదిపేశాయి. కేంద్రమంత్రి ప్రకాష్ జావదేకర్ ఈ అంశాన్నిసభలో లేవనెత్తడంతో బీజేపి, శివసేన, ఎన్సీపీ ఎంపీల మధ్య నినాదాలు ఊపందుకున్నాయి. తీవ్ర గంధరగోళం మధ్య చైర్మన్ సభను రెండు గంటల వరకు వాయిదా వేశారు. కాగా బీజేపి ఎంపీలు అనిల్ దేశ్ ముఖ్ రాజీనామాను డిమాండ్ చేస్తూ రాష్ట్ర గవర్నర్ కోశ్యారీని కలవనుంది. ఈ నేపథ్యంలో అధికార శివసేన కూటమి ప్రభుత్వం మాత్రం అనిల్ పై వచ్చిన అరోపణలను ఖండిస్తున్నారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంటి ఎదుట పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని పార్క్ చేసిన కేసులో పోలీసు అధికారి సచిన్ వాజే అరెస్టు చేసిన తరువాత వస్తున్న అరోపణలతో రాష్ట్ర ప్రభుత్వంపై అరోపణలు పెల్లుబిక్కుతున్నాయి. 16 ఏళ్లు సస్పెన్షన్ లో వున్న వాజేను రాష్ట్రంలోని శివసేన ప్రభుత్వం పోస్టింగ్ కల్పించడంతో అరోపణలు మరింతగా పెరిగాయి. ఈ క్రమంలో ఇటీవలే బదిలీ అయిన ముంబై మాజీ పోలీస్ కమీషనర్ పరమ్ వీర్ సింగ్ కూడా మరో బాంబు పేల్చారు. హోం మంత్రి ప్రతినెలా రూ.100 కోట్ల వసూళ్లను వాజేకు లక్ష్యంగా పెట్టారంటూ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు రాసిన లేఖ.. మీడియాకు చిక్కడంతో అరోపణలు మరింతగా పెరిగాయి.
ఇదే సమయంలో మహా వికాస్ ఆఘాడీ కూటమి పెద్దగా.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పరిస్థితిని తన భుజాలమీద వేసుకుని పరిష్కరించేందుకు ప్రయత్నిచారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆ సమయంలో హోంమంత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఫిబ్రవరి 5 నుంచి 15 మధ్య అనిల్ దేశ్ ముఖ్ ఆసుపత్రిలో ఉన్నారన్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 15 నుంచి 27 మధ్య నాగ్ పూర్ లోని ఆయన ఇంట్లో ఐసోలేషన్ లో ఉన్నారని చెప్పారు. ఆరోపణలపై దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. తుది నిర్ణయం ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేదేనని అన్నారు.
అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలున్న కారును పెట్టిన కేసులో దర్యాప్తును తప్పుదోవ పట్టించడానికే అవినీతి మరకలు అంటిస్తున్నారని ఆరోపించారు. దర్యాప్తులో లోపాలున్నాయని, వాటి నుంచి తప్పించుకునేందుకు ఈ నాటకాలని అన్నారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ చేసిన అరెస్టులతోనే హిరెన్ ను ఎవరు చంపించారో తేలిపోయిందన్నారు. ఎవరి కోసం ఆ ఇద్దరు హిరెన్ ను చంపేశారని ప్రశ్నించారు. ఏటీఎస్ పోలీసులు సరైన దిశలో దర్యాప్తు చేస్తున్నారని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more