బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి ప్రమేయం లేదని తేల్చిన బెంగుళూరు పోలీసులు తాజాగా సినీపరిశ్రమకు చెందిన లింకులు ఫైనాన్షియర్ల రూపంలో వున్నాయని దర్యాప్తులో తెలుసుకున్నారు. ఈ కేసులో తెలంగాణకు చెందిన కొందరు వ్యాపారవేత్తలతో పాటు రాష్ట్రానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేల మెడకు చుట్టుకుంది.
ఈ కేసులో కీలకంగా మారిని ఇద్దరు హైదరాబాద్ వ్యాపారవేత్తలను బెంగళూరు పోలీసులు విచారించారు. వారి విచారణలో పలు ఆసక్తికర విషయాలు బహిర్గతమయ్యాయని సమాచారం. ఈ కేసులో నగరానికి చెందిన సందీప్‌రెడ్డి, కలహర్ రెడ్డిల పాత్రపై దర్యాప్తు చేపట్టగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే సందీప్‌రెడ్డిని బెంగళూరు పోలీసులు విచారించారు. బెంగళూరులో సందీప్, కలహర్‌రెడ్డి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. బెంగళూరులో పబ్‌లు, హోటల్స్ వ్యాపారంలో వీరిద్దరూ ఉన్నారు.
తెలంగాణకు చెందిన ప్రముఖులకు నిత్యం పార్టీలు ఇస్తున్నట్టు గుర్తించారు. కన్నడ సినీ పరిశ్రమతో కూడా వీరికి సంబంధాలు ఉన్నాయి. కన్నడ సినీ పరిశ్రమకు కలహర్, సందీప్‌లు ఫైనాన్స్ చేస్తున్నారు. నిర్మాత శంకర్‌గౌడ్‌తో కలిసి ఫైనాన్స్ చేస్తున్నట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. కొన్నాళ్ల క్రితం నైజీరియన్స్‌ను బెంగళూరు పోలీసులు పట్టుకోగా.. తీగ లాగితే డొంక కదిలింది. కలహర్, సందీప్, శంకర్‌గౌడ్‌లకు ఈ నైజీరియన్స్ డ్రగ్స్ సరఫరా చేశారు. ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యాపారవేత్తలకు బెంగళూరు పోలీసులు నోటీసులిచ్చారు.
అయితే ఈ కేసులో కలహర్‌రెడ్డి, శంకర్‌గౌడ్ పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. కలహర్‌రెడ్డి ప్రజా ప్రతినిధులకు పార్టీలిచ్చేవాడని విచారణలో సందీప్ తెలిపాడు. పార్టీలో నలుగురు ఎమ్మెల్యేలు, తెలుగు సినీ ప్రముఖులు పాల్గొన్నారని చెప్పాడు. ఓ ఎమ్మెల్యే నేరుగా కొకైన్‌ను తీసుకెళ్లినట్లుగా తెలిపాడు. ఎమ్మెల్యే కోరిక మేరకు పలుమార్లు కొకైన్ పంపినట్లు సందీప్ చెప్పుకొచ్చాడు. నలుగురు ఎమ్మెల్యేలు కూడా డ్రగ్స్ తీసుకున్నారని విచారణలో సందీప్ వెల్లడించాడు. కలహర్‌రెడ్డి, శంకర్‌గౌడ్‌తోపాటు ఆ నలుగురు ఎమ్మెల్యేలను బెంగళూరు పోలీసులు విచారించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more