ఓ మహిళ చేపలు కొనడానికి వచ్చి సముద్రం వద్దకు వచ్చి అక్కడ సంద్రాన్ని చూస్తూ.. సముద్రం నీరు కు అడ్డుగా కట్టిన భారీ గోడపై కూర్చుంది. ఎంతో హాయిగా అనిపించినట్టు వుంది. హాయాగా కూర్చొని ఎంజాయ్ చేసింది. అయితే ఆకస్మాత్తుగా అమెకు సోషవచ్చి సముద్రంలో పడిపోయింది. మహారాష్ట్ర రాజధాని, దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని తాజ్ హోటల్ ఎదురుగా వున్న గేట్ వే అఫ్ ఇండియా వద్ద చోటు చేసుకుంది. అమె సముద్రంలో పడిపోవడాన్ని గమనించిన ఓ ఫోటోగ్రాఫర్ వెంటనే సముద్రంలోకి దూకి అమెను ప్రాణాలను కాపాడాడు.
కొలాబా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముంబైలోని ఖార్ ప్రాంతానికి చెందిన ముఫై ఏళ్ల పల్లవి ముండే అనే మహిళ చేపలు కోనేందుకని ఇంటి నుంచి నిన్న ఉదయం బయలుదేరి ముంబై సముద్రతీరంలోని సాసూనే డాక్ వద్దకు వచ్చింది. ఎలాగో అక్కడి వరకు వచ్చిందని సరదాగా ముంబై గేట్ వే అఫ్ ఇండియా వద్ద సముద్రాన్ని చూస్తూ కొద్ది సేపు అస్వాధించింది. అలా సముద్రుడ్ని చూస్తూ.. హాయిగా కొద్ది సేపు గడిపిన ఆమెకు అనుకోకుండా సోషవచ్చింది. అంతే అకస్మాత్తుగా పట్టుతప్పి పడిపోయింది. తేరుకుని చూసేలోపు అమె సముద్రంలో పడిపోయింది.
అంతే కాపాడండీ అంటూ కేకలు వేసినా.. ఎవరికీ వినబడనంత ఎత్తు (20 ఫీట్లకు పైగా వున్న) గోడ అవరోధంగా వుంది. తన ప్రాణాలు సముద్రుడిలో కలిసిపోవాల్సిందే అనుకునే సమయంలో అమెను సముద్రంలోకి పడిపోతుండగా చూసిన స్థానిక ఫోటోగ్రాఫర్ గులాబ్ చంద్ గోండ్ హుటాహుటిన సముద్రంలోకి దూకి అమెను మునిగిపోకుండా కాపాడాడు. ఇంతలో మిగలిన పర్యాటకులు అప్రమత్తమయ్యారు. బాధిత మహిళ బయటకు తీసుకురావడంలో వారు లైఫ్ బెలూన్ వేయడంతో పాటు తాళ్లు వేశారు. తాళ్ల సాయంతో అమెను గొడకు మరోవైపు తీసుకువచ్చిన ఫోటోగ్రాఫర్ అమెను శ్రమించి బయటకు తీసుకురావడంలో విజయవంతమయ్యాడు. సకాలంలో స్పందించి ఆమె ప్రాణాలను కాపాడిన ఫోటోగ్రాఫర్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. పలువురు గులాబ్ చంద్‌ను అభినందించారు.
#WATCH | Mumbai: A photographer rescued a woman who lost her balance as she was sitting on the safety wall near Gateway of India and fell into the sea yesterday. pic.twitter.com/9Nraxm0gVu
— ANI (@ANI) July 12, 2021
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more