Govt introduces new BH registration series for vehicles అంతరాష్ట్ర వాహనాల కోసం సరికొత్త సిరీస్.. రీ-రిజస్ట్రేషన్ కు బ్రేక్..

Govt introduces new registration mark under bh series for new vehicles

MORTH, Bharat series registration mark, BH-series, Bharat series, vehicle registration, new vehicle registration, Ministry of Road Transport and Highways,new vehicle rules,BH number series,ministry of road transport,vehicle registration, transfer to states, vehicle registration, Bharat series, BH series, Ministry of Road Transport and Highways, MoRTH

The Ministry of Road Transport and Highways notified that it has introduced a new registration mark for new vehicles, called the Bharat series (BH-series). Additionally, a vehicle with a BH mark will not require a new registration mark when the owner shifts from one state to another state.

అంతరాష్ట్ర వాహనాల కోసం సరికొత్త సిరీస్.. రీ-రిజస్ట్రేషన్ కు బ్రేక్..

Posted: 08/28/2021 07:43 PM IST
Govt introduces new registration mark under bh series for new vehicles

వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇంధన ధరలు తగ్గిస్తోందా.? అని అనుకుంటే పోరబాటే. ఈ గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర రోడ్లు, రవాణ, హైవేల మంత్రిత్వ శాఖ. అంతరాష్ట్ర వాహనాలను కొనుగోలు చేస్తున్న వారు ఇకపై తమ వాహన రిజిస్ట్రేషన్​ మార్చాల్సి అవసరం లేదని కేంద్రం వెల్లడించింది. దీని కోసం ఓ కొత్త సిరీస్ ను తీసుకొచ్చింది. ఇప్పటిదాకా ఒక రాష్ట్రంలో రిజిస్టర్ అయిన వాహనాన్ని వేరే రాష్ట్రంలో నడుపుకోవాలంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ను మార్చాల్సి ఉండేది. కానీ ఇకనుంచి ఆ అవసరం లేదని కేంద్రం తెలిపింది.

కేంద్ర రోడ్లు, రవాణ శాఖ నిబంధనల్లో మార్పులు చేసిన సంబంధిత మంత్రిత్వశాఖ.. ఇందుకోసం ‘భారత్ సిరీస్’ తీసుకొచ్చింది. ఈ సిరీస్ ను ‘బీహెచ్’ సిరీస్ గా పేర్కోన్నారు. ఇందుకు  సంబంధించిన నోటిఫికేషన్ ను కేంద్ర రోడ్లు, రవాణ, హైవేల మంత్రిత్వ శాఖ ఇవాళ జారీ చేసింది. వ్యక్తిగత వాహనాలను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయడానికి సులువైన విధానాన్ని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తీసుకువచ్చింది. వాహన రిజిస్ట్రేషన్‌ కు సంబంధించి కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఉద్యోగ రీత్యా వేరే రాష్ట్రాలకు వెళ్లినప్పుడు తమ వ్యక్తిగత వాహనాలకు మళ్లీ రిజిస్ట్రేషన్‌ చేయించాల్సిన అవసరం లేకుండా ‘బీహెచ్‌’ (భారత్‌ రిజిస్ట్రేషన్‌) రిజిస్ట్రేషన్‌ సిరీస్ ను తీసుకొచ్చింది.

కేంద్ర భద్రతా బలగాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉద్యోగులు, ప్రైవేటు కంపెనీలు, వివిధ సంస్థల ఉద్యోగులు ఈ రిజిస్ట్రేషన్‌ సదుపాయాన్ని స్వచ్ఛందంగా ఉపయోగించుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికైనా సులువుగా వెళ్లేందుకు ఈ విధానం వీలుగా ఉంటుందని వెల్లడించింది.దీనివల్ల ఒక రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతంలోని వాహన యజమాని మరొక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి బదిలీ అయినపుడు తన వాహనానికి మరోసారి రిజిస్ట్రేషన్ చేయించవలసిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఒక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ చేయించిన వాహనాన్ని గరిష్ఠంగా 12 నెలల వరకు మాత్రమే వేరే రాష్ట్రంలో ఉపయోగించుకునే వీలుంటుంది.

ఒకవేళ ఏడాది కాలానికి పైగా వాహనం నడుపుకోవాల్సిన అసవరం వస్తే నిర్ణీత గడువులోగా మళ్లీ రిజిస్ట్రేషన్‌ చేయించాలి. దీంతో చాలామంది ఉద్యోగులకు ఈ విషయంలో ఇబ్బందులు ఎదురౌతున్నాయి. ఈ క్రమంలో కేంద్రం బీహెచ్‌ సిరీస్ ను ప్రవేశపెట్టింది. బీహెచ్ సిరీస్ క్రింద వాహనాల రిజిస్ట్రేషన్ విధానం ప్రయోజనాన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ఉద్యోగులు పొందవచ్చు. నాలుగు లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కార్యాలయాలు గల కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర, రాష్ట్ర పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్స్, ప్రైవేట్ సెక్టర్ కంపెనీలు,ఆర్గనైజేషన్లలో పని చేసే ఉద్యోగులు ఈ విధానంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles