Wild bears playing football in Odisha village ఒడిశాలో భల్లుకాల బంతాట.. నెట్టింట్లో వీడియో వైరల్..

Two wild bears play football in odisha s nabarangpur video goes viral

Wild bears play football, Wild bears football, Wild bears Odisha, Wild bears Nabarangpur forest, Viral Video of bears playing football, Nabarangpur forest, wild bear, animal videos, football, playing with ball, Jugal Sahu, playing football, Sukigaon village,Nabarangpur, odisha, viral video

A video of two wild bears playing with a football went viral on social media. The video of the wild bears was recorded in Nabarangpur forest in Odisha. n the video, one of the bears was seen kicking the ball & tossing it in the air. The locals who shot the video enjoyed the rare sight of the bears playing.

ఒడిశాలో భల్లుకాల బంతాట.. నెట్టింట్లో వీడియో వైరల్..

Posted: 09/14/2021 12:36 PM IST
Two wild bears play football in odisha s nabarangpur video goes viral

వన్యమృగాలను చూస్తేనే ప్రజలు భయపడుతుంటారు. ఎందుకంటే అవి దాడి చేసి ప్రాణాలు హరిస్తాయని తెలుసు. అయితే ఈ మధ్యకాలంలో అవి కూడా మనుషులను బాగా పరిశీలించి.. మనుషుల మాదిరిగా సరదాలు చేయాలని భావిస్తున్నట్లు ఉన్నాయి. ఆ మధ్యకాలంలో ఓ రామ చిలుక ఏకంగా సెల్ ఫోన్ ను ఎత్తుళ్లడం, ఆ తరువాత కోతి కూడా మనిషి మాదిరిగానే బుల్లెట్టు బండి పెడితే కానీ ఆహారం తీసుకోకపోవడం.. ఇక శునకం మనిసి మాదిరిగా క్రమశిక్షణతో వ్యవహరించడం, ఏనుగు ఫైప్ లోని నీటిని తాగడం వంటి ఘటనలు చూస్తే అలానే అనిపిస్తోంది.

కానీ భల్లూకాలను చూడంగానే ప్రజలు భయకంపితులు కావడం కామన్. అయితే అప్పుడప్పుడూ ఇవి గ్రామాల్లోకి ప్రవేశిస్తే.. ప్రజలు భయంతో పరుగులు తీస్తుంటారు. ఇవిమనుషులపై దాడులు చేస్తూ ప్రాణాలను తీస్తున్న ఘటనలు కూడా అనేకం. అయితే ఇలానే ఓ గ్రామంలోని ప్రవేశించిన రెండు భల్లూకాలు మాత్రం ఎప్పటి నుంచి అక్కడ బాలురు అడుతున్న ఫుట్ బాల్ ఆటను గమనిస్తున్నాయో ఏమో తెలియదు కానీ.. చక్కగా ఆటాడే విధానాన్ని చూశాయి. అంతే ఇక చాలునని అనుకుని తాము అడాలని భావించాయోమో కానీ ఏకంగా క్రీడా మైదానానికి వచ్చేశాయి.

క్రీడాకారులు ఆడుతున్న ఫుట్ బాల్‌ బంతిని తీసుకుపోవడంతో పాటు దానితో ఆడుకోవడం అందరినీ ఆశ్చర్య పరిచింది. మైదనాంలోకి వాటి రాకను చూసిన కొందరు గ్రామాస్థులు అవేం చేస్తాయా.? అన్న ఆసక్తితో తమ సెల్ ఫోన్లలో వాటిని వీడియో తీయడంతో చక్కని దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. ఇక వాటిని సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో అవికాస్తా విపరీతంగా చక్కర్లు కోడుతున్నాయి. ఒడిశా రాష్ట్రంలోని నవరంగపూర్‌ జిల్లాలోని ఉమ్మరకోట్‌ సమితి మృత్తిమా పంచాయతీ శుఖిగాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శుఖిగాం గ్రామానికి చెందిన చిన్నారులు స్థానిక క్రీడా మైదానంలో ఎప్పటిలాగే ఫుట్‌బాల్‌ ఆడేందుకు వెళ్లారు.

వారంతా ఆటలో నిమగ్నమై ఉండగా.. సమపంలోని అడవిలో నుంచి అకస్మాత్తుగా రెండు ఎలుగుబంట్లు మైదానంలోకి ప్రవేశించాయి. వాటిని చూసిన చిన్నారులు భయంతో కేకలు వేస్తూ పారిపోయారు. అయితే రెండు భల్లూకాలు మాత్రం బంతితో ఫుట్ బాల్‌ ఆడటం ప్రారంభించాయి. ఈ వీడియోలను నెట్టింట్లో చూసిన నెట్టిజనులు.. వీటి ఆటను చూసి వన్యప్రాణులపై కామెంట్లు పెడుతున్నారు. కాగా గ్రామానికి చెందిన జుగల్ సాహూ దీనిపై స్పందిస్తూ.. తాను గ్రామం వెలుపల చాలాస్లారు ఎలుగుబంట్లను చూశానని, అయితే గ్రామంలోనికి రావడం మాత్రం ఇదే ప్రథమం అని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles