వన్యమృగాలను చూస్తేనే ప్రజలు భయపడుతుంటారు. ఎందుకంటే అవి దాడి చేసి ప్రాణాలు హరిస్తాయని తెలుసు. అయితే ఈ మధ్యకాలంలో అవి కూడా మనుషులను బాగా పరిశీలించి.. మనుషుల మాదిరిగా సరదాలు చేయాలని భావిస్తున్నట్లు ఉన్నాయి. ఆ మధ్యకాలంలో ఓ రామ చిలుక ఏకంగా సెల్ ఫోన్ ను ఎత్తుళ్లడం, ఆ తరువాత కోతి కూడా మనిషి మాదిరిగానే బుల్లెట్టు బండి పెడితే కానీ ఆహారం తీసుకోకపోవడం.. ఇక శునకం మనిసి మాదిరిగా క్రమశిక్షణతో వ్యవహరించడం, ఏనుగు ఫైప్ లోని నీటిని తాగడం వంటి ఘటనలు చూస్తే అలానే అనిపిస్తోంది.
కానీ భల్లూకాలను చూడంగానే ప్రజలు భయకంపితులు కావడం కామన్. అయితే అప్పుడప్పుడూ ఇవి గ్రామాల్లోకి ప్రవేశిస్తే.. ప్రజలు భయంతో పరుగులు తీస్తుంటారు. ఇవిమనుషులపై దాడులు చేస్తూ ప్రాణాలను తీస్తున్న ఘటనలు కూడా అనేకం. అయితే ఇలానే ఓ గ్రామంలోని ప్రవేశించిన రెండు భల్లూకాలు మాత్రం ఎప్పటి నుంచి అక్కడ బాలురు అడుతున్న ఫుట్ బాల్ ఆటను గమనిస్తున్నాయో ఏమో తెలియదు కానీ.. చక్కగా ఆటాడే విధానాన్ని చూశాయి. అంతే ఇక చాలునని అనుకుని తాము అడాలని భావించాయోమో కానీ ఏకంగా క్రీడా మైదానానికి వచ్చేశాయి.
క్రీడాకారులు ఆడుతున్న ఫుట్ బాల్ బంతిని తీసుకుపోవడంతో పాటు దానితో ఆడుకోవడం అందరినీ ఆశ్చర్య పరిచింది. మైదనాంలోకి వాటి రాకను చూసిన కొందరు గ్రామాస్థులు అవేం చేస్తాయా.? అన్న ఆసక్తితో తమ సెల్ ఫోన్లలో వాటిని వీడియో తీయడంతో చక్కని దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. ఇక వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవికాస్తా విపరీతంగా చక్కర్లు కోడుతున్నాయి. ఒడిశా రాష్ట్రంలోని నవరంగపూర్ జిల్లాలోని ఉమ్మరకోట్ సమితి మృత్తిమా పంచాయతీ శుఖిగాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శుఖిగాం గ్రామానికి చెందిన చిన్నారులు స్థానిక క్రీడా మైదానంలో ఎప్పటిలాగే ఫుట్బాల్ ఆడేందుకు వెళ్లారు.
వారంతా ఆటలో నిమగ్నమై ఉండగా.. సమపంలోని అడవిలో నుంచి అకస్మాత్తుగా రెండు ఎలుగుబంట్లు మైదానంలోకి ప్రవేశించాయి. వాటిని చూసిన చిన్నారులు భయంతో కేకలు వేస్తూ పారిపోయారు. అయితే రెండు భల్లూకాలు మాత్రం బంతితో ఫుట్ బాల్ ఆడటం ప్రారంభించాయి. ఈ వీడియోలను నెట్టింట్లో చూసిన నెట్టిజనులు.. వీటి ఆటను చూసి వన్యప్రాణులపై కామెంట్లు పెడుతున్నారు. కాగా గ్రామానికి చెందిన జుగల్ సాహూ దీనిపై స్పందిస్తూ.. తాను గ్రామం వెలుపల చాలాస్లారు ఎలుగుబంట్లను చూశానని, అయితే గ్రామంలోనికి రావడం మాత్రం ఇదే ప్రథమం అని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more