తెలంగాణ తిరుపతిగా అద్భుతంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి దేవాలయం చేరుకున్న భక్తులకు గుట్ట ఆవరణలో అడుగుపెట్టగానే ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా ఆలయ జీర్ణోద్దరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక కొండపైకి చేరుకున్న తరువాత సాక్ష్యాత్తు వైకుంఠంలోకి ప్రవేశించిన భావన భక్తులలో ఫరడవిల్లేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో యాదాద్రి కొత్త శోభను సంతరించుకోనుంది. గర్భాలయంపై 48 అడుగుల ఎత్తుతో నిర్మించిన విమాన గోపురానికి 45 అడుగుల మేర బంగారు తాపడం చేయాలని యాదాద్రి ఆలయ అధికారులు నిర్ణయించారు.
దీంతో భక్తుల నుంచి విరాళాలు సేకరించేందుకు ఆలయ కమిటీ నిర్ణయించింది. యాదాద్రి విమానగోపురం స్వర్ణ తాపడం కోసం ఏకంగా 60 కేజీల బంగారం అవసరం అవుతుందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో స్వామిఅమ్మవార్లు కొలువుదీరనున్న ఈ ఆలయ విమానగోపురంలో తమకు అవకాశం కల్పించాలని ఇప్పటికే రాష్ట్రంలోని అనేక మంది భక్తాగ్రేసుల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆలయ విమానగోపురానికి స్వర్ణతాపడం చేయడం కోసం అవసరమయ్యే 60 కేజీల బంగారాన్ని భక్తుల నుంచే సేకరించాలని ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుందని సమాచారం. అయితే మరికోందరు మాత్రం రాష్ట్రంలోని పలువురు దాతల నుంచి బంగారాన్ని సేకరించాలని నిర్ణయించారని తెలుస్తోంది.
కాగా సామాన్య భక్తులు కూడా తమ శక్తిమేరకు బంగారాన్ని అదే రూపంలోనైనా లేక ధన రూపంలోనైనా చెల్లించేలా చేసి.. ఆలయ జీర్ణద్దరణ కార్యక్రమంలో వారికి అవకాశాన్ని కల్పించేలా చేయాలని ఆలయ కమిటీలో అత్యధికులు నిర్ణయించారని తెలుస్తోంది. మరి ఈ నిర్ణయాలపై రాష్ట్ర దేవాదాయశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందన్న విషయం వేచిచూడాల్సిందే. మరోవైపు, ఉత్సవ మూర్తుల నిత్య ఉత్సవాలకు వినియోగించే కొయ్య రథానికి స్వర్ణ తొడుగుల పని దాదాపు పూర్తయింది. రాగి తొడుగులు ఇప్పటికే సిద్ధం కాగా, వాటికి బంగారు తాపడం చేస్తే పని పూర్తయినట్టే. ఈ నెలాఖరు లోపు రథం యాదాద్రికి చేరుకుంటుందని ఆలయ ఈవో గీత తెలిపారు. కాగా, స్వర్ణ రథం తయారీకి రూ. 60 లక్షలు ఖర్చవుతుండగా దానిని శ్రీలోగిళ్లు, ల్యాండ్‌మార్క్ రియల్ ఎస్టేట్ సంస్థల అధినేతలు సురేశ్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి భరిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more