జాతీ వైరం కూడా మరిచి కొన్ని సందర్భాలలో శునకాలు, పిల్లులు కలసి ఒకే ఇంట్లో స్నేహితుల మాదిరిగా మొలుగుతూ కనిపిస్తుంటాయి. అలాంటి దృష్యాలు చూసినప్పుడు.. అక్కడే కొంత సమయం గడిపినా తప్పు లేదనిపిస్తోంది. ఇక మేక, కోతి మధ్య ఎలాంటి జాతి వైరం లేదు. అధిపత్య పోరూ ఉండదు. అయితే వాటి మధ్య స్నేహం కూడా పెద్దగా కనిపించదు. అనుకుంటున్నారా..? కానీ ఉంది. ఈ రెండు జీవుల మధ్య స్వచ్ఛమైన స్నేహం కనిపిస్తుంది ఈ వీడియోలో. ఔనా అంటారా.. ఈ వీడియో ఇప్పటికే నెట్టింట్లో పెను సందడి చేస్తోంది.
అడవుల్లో తీసిన ఈ వీడియో ఇప్పుడు నెట్ జనులు అమితంగా ఇష్టపడుతున్న వీడియోగా మారింది. ఎంతలా అంటే ఈ వీడియోను నెట్టింట్లో పోస్టు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే కోటి మందికి పైగా వీడియోను వీక్షించారు. ఎందరెందరో షేర్ చేయడం, లైకులు కొట్టడం. మరికోందరు కామెంట్లు పెట్టడంతో ఈ వీడియో నెట్టింట్లో ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది. వీడియో పోస్టు చేసిన ఒక్క రోజులో 13మిలియన్ వ్యూస్ దక్కించుకోవడంతో పాటు 5లక్షల 34వేల లైకులు దక్కించుకుంది. పైగా దీనిని లక్షా 5సార్లు రీట్వీట్ చేశారు.తనపై అభిమానంతో తెచ్చిన పండ్లను స్నేహితుడైన కోతితో పంచుకునేందుకు పరిగెత్తుకొచ్చింది మేక. అది కూడా కోతిని ఎక్కించుకుని అక్కడకు తీసుకొచ్చింది.
చేతిలో బెర్రీ పండ్లను వేసుకుని మేకను పిలిచిన వ్యక్తి మెడలో కోతిని వేలాడేసుకుంటూ వస్తున్న మేకను చూసి ఆశ్చర్యపోయాడు. అతని చేతుల్లో ఉన్న బెర్రీ పండ్లను మేక నోటికి అందించాడు. అంతే ప్రేమగా వాటిని తీసుకుని తింటున్న మేకను చూసి కోతి కొంత సందిగ్ఘతకు గురైంది. కాసేపటి తర్వాత వాటినీ దగ్గరగా చూపడంతో అవి బెర్రీలని తెలిసి తాను ట్రీట్ లో జాయిన్ అయ్యింది. తాను కూడా ఓ బెర్రీ పండును తీసుకుని తన స్నేహితుడిపై కంఫార్టుగా కూర్చుని తినింది. రెండు సాధు జంతువుల మధ్య స్నేహానికి.. అవి అంత చొరవగా మనిషి నుంచి బెర్రీలు తీసుకుని తినడం చూసి నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Am I high right now what is happening pic.twitter.com/itBaV1XUNK
— Kristi Yamaguccimane (@wapplehouse) September 26, 2021
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more