వివేకా హత్య కేసులో అయిదో నిందితుడు శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె తన పిటిషన్లో వివేకా హత్యకేసు ఏకపక్షంగా సాగుతోందని పేర్కోన్నారు. ఈ కేసులో దర్యాప్తు సంస్థగా వున్న సీబిఐ.. ఒకే కోణంలో దర్యాప్తును చేపడుతుందే తప్ప.. ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, ప్రతిపక్ష పార్టీ నేత టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ బీటెక్ రవి తదితరులను విచారించడం లేదని అన్నారు.
వైఎస్ వివేకా హత్య రాజకీయపరంగా జరిగివుండవచ్చును లేదా.. తన ఆస్తి వ్యవహారాల విషయమై కూడా జరిగి వుండవచ్చునని అమె తన పిటీషన్లో పేర్కోన్నారు. దీంతో అనుమానితులుగా వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పేర్లను కూడా చేర్చి దర్యాప్తు చేయాలని ఆమె పేర్కొన్నారు. అమె ఈ నెల 21న దాఖలు చేసిన పిటిషన్ వివరాలను విడుదల చేశారు. సీబీఐ అధికారులు కేసును ఏకపక్షంగా దర్యాప్తు చేస్తున్నారని, మరో కోణంలో విచారణ చేయట్లేదని ఆరోపించారు.
అసలైన నిందితులను కాకుండా.. కేసుతో సంబంధంలేని తన భర్తను సీబీఐ అరెస్టు చేసిందని పిటిషన్లో పేర్కొన్నారు. వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, ఆయన సోదరుడు శివప్రకాష్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, కొమ్మా పరమేశ్వర్‌రెడ్డి, వై.జి.రాజేశ్వర్‌రెడ్డి, నీరుగట్లు ప్రసాద్‌ను అనుమానితులుగా చేర్చారు. ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల గొడవ కారణంగానే వివేకా హత్య జరిగి ఉంటుందని పేర్కొన్నారు. ఈ కోణంలో సీబీఐ దర్యాప్తు చేయకుండా.. ఏకపక్షంగా చేస్తోందని ఆరోపించారు.
వివేకా రెండోపెళ్లి చేసుకున్నారని, ఓ కొడుకు పుట్టిన విషయం అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. బెంగళూరులో భూమి సెటిల్మెంట్ ద్వారా వచ్చిన డబ్బుల్లో రూ.2 కోట్లు రెండో భార్యకు ఇస్తానని వివేకా చెప్పారని, కొంత ఆస్తి కూడా ఆమె పేరిట రాశారని వివరించారు. ఈ విషయమై వివేకాకు.. కుటుంబసభ్యులకు గొడవలు ఉన్నాయని, ఈ కారణంగానే ఆయన భార్య సౌభాగ్యమ్మ హైదరాబాద్‌లో కూతురు సునీత వద్ద ఉన్నట్లు తెలిపారు. రెండో భార్యను అల్లుడు పలుమార్లు బెదిరించారని, ఈ విషయంలో పెద్ద వివాదమే ఉన్నట్లు పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more