Man Shows New Technique of Making Roti గాల్లోకి ఎగరేసి చపాతిని తిప్పుదామని..

Man s technique of flipping roti goes horribly wrong

Man Shows New Technique of Making Roti, making roti, making roti at home, making roti canai, making roti in roti maker, making roti in air fryer, making roti on tawa, man shows new technique, viral video, viral video editing, viral video link, viral video song, viral video today, viral video 2022, viral video 2022 tiktok, latest viral video, Man, New Technique, Making Roti, Tawa, Tiktok, social media, cooking technique, flipping roti, funny cooking video, funny video

In the clip, a man is sitting on the floor and cooking rotis on a small cylinder stove. He then takes the tawa on the side and tries to flip the roti in the air, but the handle breaks and the hot tawa falls on him.

ITEMVIDEOS: రుమాలీ రోటీ మాదిరిగా గాల్లోకి ఎగరేసి తిప్పుదామని..

Posted: 09/23/2022 06:05 PM IST
Man s technique of flipping roti goes horribly wrong

సోషల్‌ మీడియా అంటూ వచ్చిన తరువాత.. దీనికి తోడు చేతిలో స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రాగానే.. ప్రతీ ఒక్కరూ నెట్టింట్లో ఒక వీడియో పెట్టాలన్న అలోచనలకు వస్తున్నారు. కష్టపడి వీడియోను నెట్టింట్లో పోస్టు చేస్తున్నారు. ఇక వారి శ్రమను చాలా వరకు తగ్గించడానికి పలు యాప్ లు అందుబాటులోకి వచ్చేసరికి ఇక యువత.. అనునిత్యం స్మార్ట్ ఫోన్లలలోనే నిమగ్నమవుతున్నారు. ఒకే ఒక్క చాన్స్ అన్న డైలాగ్ తరహాలో ఒకే ఒక్క వీడియో అంటూ తాము పాపులర్ కావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే సాధారణ వీడియోలతో తమకు పాపులారిటీ రాదని వింత వింత ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా రాత్రికిరాత్రే స్టార్ కావాలన్న ప్రయత్నాల్లో నిమగ్నమై.. వాళ్లు మాత్రమే  చేయాల్సిన మిగతా పనులను పక్కన బెట్టేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు సోషల్‌ మీడియాలో క్లిక్‌ అయి మంచి ఆఫర్‌ సైతం కిట్టేసిన వారున్నారు. ఇదే క్రమంలో అడ్రస్‌ లేకుండా గల్లంతైనా వారు కూడా లేకపోలేదు. అయినా పాపులారిటీ రావాలంటే ఏదో ఒక విషయంలో నిష్ణాతులై ఉండాలన్న విషయం వీళ్లకు తెలియడం లేదు. ఇక వీరు చేసే వింతైన విభిన్నమైన ప్రయత్నాలు కాస్తా బెడిసికొట్టి ట్రోలింగ్ కూడా అవుతున్నారు.

కాగా, తాజాగా ఓ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సదరు వ్యక్తి చేసిన పని.. నెటిజన్లను తెగ నవ్విస్తోంది. వైరల్‌ అయిన వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందే.. ఓ యువకుడి తన ఇంట్లో చపాతి(రోటీ చేసేందుకు) రెడీ అయ్యాడు. చపాతీ చేసి గ్యాస్‌ పొయ్యి మీద పెట్టి కాలుస్తున్నాడు. ఇంతలో ఏదో చేద్దామని ప్రయత్నిస్తే.. మొదటికే మోసమైంది. పెనం మీద ఉన్న చపాతీని ఎగరేసే క్రమంలో కర్రకు ఉన్న పెనం ఊడిపోయి అతడి మీదే పడిపోయింది. దీంతో గాయమైనట్టు తెలుస్తోంది. దీంతో, ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. 

 
 
 
View this post on Instagram

A post shared by VIDEO NATION (@videonation.teb)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Man  New Technique  Making Roti  Tawa  Tiktok  social media  air flying  Toss and turn  2 kg LPG Cylinder  viral video  

Other Articles