కేజీ బేసిన్ చమురు, సహజవాయువు క్షేత్రాలకు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ప్రభుత్వానికి మధ్య మరోసారి అగ్గిరాజుకున్నది. కేజీ బేసిన్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించని పక్షంలో 2015 నాటికి అక్కడ సహజవాయువు ఉత్పత్తి పూర్తి అట్టడుగు స్థాయి కి పడిపోతుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), బ్రిటన్‌కు చెందిన దాని భాగస్వామ్యం సంస్థ బిపి ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. కాగా, పద్దు పుస్తకాలను కాగ్ ఆడిట్ చేయకుండా అడ్డుకుంటున్న కారణంగానే కేజీ బేసిన్‌కు సంబంధించిన వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించలేదని ప్రభుత్వం స్ప ష్టం చేసింది. కేజీ బేసిన్‌కు సంబంధించి కొంతకాలంగా కొనసాగుతున్న ప్రతిష్ఠంభనను తొలిగించేందుకు రిలయన్స్ గత కొద్దిరోజులుగా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కొద్దిరోజులక్రితం రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ మాంటెక్ సింగ్ అహ్లూవాలియాను కలుసుకున్నారు. అంతకు క్రితం ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కూడా కలుసుకున్నారు. తాజాగా గత శుక్రవారం నాడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్, బిపి ఇండియా హెడ్ శశి ముకుందన్ చమురు శాఖ మంత్రి జైపాల్ రెడ్డిని కలుసుకుని మూడున్నర గంటల పాటు చర్చలు జరిపారు. కేజీ బేసిన్ డెవలప్‌మెంట్, వార్షిక వ్యయానికి సంబంధించిన ప్రతిపాదనలను గత మూడేళ్లుగా ప్రభుత్వం ఆమోదించడం లేదని దీనివల్ల దేశంలోనే అతిపెద్ద సహజవాయువు ఉత్పత్తి క్షేత్రమైన కేజీబేసిన్‌లో పరిస్థితి ప్రమాదకరస్థాయిలో దిగజారుతోందని రిలయన్స్-బిపి ప్రతినిధులు మంత్రికి ఫిర్యాదు చేశారు. తక్షణమే ఇన్వెస్ట్‌మెంట్ ప్రతిపాదనలను ఆమోదించాలని మంత్రిని కోరారు.
ఈ సమావేశంలో చమురు శాఖ కార్యదర్శి జిసి చతుర్వేది, జాయింట్ సెక్రెటరీ గిరిధర్ ఆరామనే, డైరెక్టర్ జనరల్ హైడ్రోకార్బన్ రాజీవ్ నయ్ చౌబే కూడా పాల్గొన్నట్టు తెలిసింది. ఇప్పటికే కేజీ బేసిన్‌లో సహజ వాయువు ఉత్పత్తి రోజుకు 30 మిలియన్ క్యూబిక్ మీటర్లకు పడిపోయింది. వచ్చే ఏడాదికి ఇది 20 మిలియన్ క్యూబిక్ మీటర్లకు పడిపోయే అవకాశం ఉందని కూడా కంపెనీల ప్రతినిధులు హెచ్చరించారు. 2010 మార్చిలో రోజుకు 61.5 మిలియన్ క్యూబిక్ మీటర్లున్న గ్యాస్ ఉత్పత్తి క్రమంగా తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. కేజీ క్షేత్రంలో రిలయన్స్ తన వ్యయాన్ని భారీగా హెచ్చించి చూపిందన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో గత మూడేళ్లుగా ఈ క్షేత్రానికి సంబంధించిన వార్షిక బడ్జెట్లు, అదనపు ఇన్వెస్ట్‌మెంట్ ప్రతిపాదనలను చమురు మంత్రిత్వ శాఖ నియంత్రణలోని కేజీ బేసిన్ పర్యవేక్షక కమిటీ ఆమోదించలేదు.2010-11 నుంచి 2012-13 వరకు బడ్జెట్లకు ఆమోదం లభించాల్సి ఉంది. మంత్రి జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకుంటే తప్ప కేజీ బేసిన్‌లో ఉత్పత్తి పెంచేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా లేవని రిలయన్స్-బిపి ప్రతినిధులు చెప్పినట్టుగా తెలిసింది. అయితే కేజీ బేసిన్‌కు సంబంధించి రిలయన్స్ చేసిన వ్యయంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్)తో ఆడిటింగ్‌కు ప్రభుత్వం ఆదేశించింది. అయితే పద్దు పుస్తకాలను కాగ్‌కు అప్పగించడానికి రిలయన్స్ నిరాకరించడంతో ఆడిటింగ్ ముందుకు సాగలేదు. ప్రతిగా కేజీ బేసిన్‌కు సంబంధించిన వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలు, అదనపు ఇన్వెస్ట్‌మెంట్ ప్రతిపాదనలను ప్రభుత్వ కమిటీ కూడా ఆమోదించలేదు. ఇదే విషయం చమురు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. 2006-07 నుంచి 2008-09 వరకు కేజీ బేసిన పద్దు పుస్తకాలను కాగ్ ఆడిట్ చేసి నివేదికను పార్లమెంట్‌కు సమర్పించింది. ఈ నివేదికలో రిలయన్స్‌కు వ్యతిరేకంగా కాగ్ ఘాటైన వ్యాఖ్యలే చేసింది. ఆ తర్వాత కాలానికి సంబంధించిన పద్దులను కూడా ఆడిట్ చేయాల్సి ఉన్నప్పటికీ రిలయన్స్ సహకరించడం లేదని కాగ్ చెబుతోంది.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more