సచిన్ టెండూల్కర్ ఎప్పుడు రిటైర్ అవుతాడు..? అతడు కూడా సమాధానం చెప్పలేని ప్రశ్న ఇది. చాలాకాలంగా భారత క్రికెట్లో ఈ అంశం గురించి చర్చ జరుగుతూనే ఉంది. ఈ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ సచిన్ నిర్ధ్వందంగా తోసిపుచ్చాడు. కానీ తొలిసారి... తన రిటైర్మెంట్ గురించి పెదవి విప్పాడు. వచ్చే నెలలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్ తర్వాత తన కెరీర్‌ను సమీక్షించుకుంటానని చెప్పాడు. న్యూఢిల్లీ: ‘నాకు 39 సంవత్సరాలు. నేను ఎల్లకాలం ఆడతానని ఎవరూ అనుకోరు. నేను కూడా అనుకోవడం లేదు. ఆటకు నా శరీరం సహకరించినంత కాలం, నా మనసు అంగీకరించినంత కాలం ఆడతాను. ఎప్పుడూ ఒక్కో సిరీస్ గురించే ఆలోచించాను. ఇప్పుడు కూడా స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. ఆ సిరీస్ తర్వాత నా ఫామ్, నా మనసు ఏం చెబుతుంది అనే అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటాను. నాలో ఆడే సత్తా ఉంటే రిటైర్ కాను. నవంబరులో నా కెరీర్‌ను సమీక్షిస్తా’ అని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చెప్పాడు. 23 ఏళ్ల కెరీర్లో ప్రస్తుతం ఎదుర్కొంటున్న స్థాయిలో విమర్శలు ఎప్పుడూ మాస్టర్‌పై రాలేదు.
న్యూజిలాండ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్‌లో వైఫల్యం తర్వాత... రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో సచిన్...‘నేను రిటైర్ అవ్వాలనే నిర్ణయం తీసుకుంటే.. ఆ తర్వాత ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాననే ఆలోచనే రాకూడదు. ఆడే సత్తా ఉన్నా రిటైరయ్యాననే బాధ కలగకూడదు’తొలిసారి రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నట్లు తెలిపాడు. ‘ఏదో ఒక రోజు రిటైర్ కావాలి. ప్రస్తుతం మాత్రం నా మనసులో ఆ ఆలోచన లేదు. ఇంగ్లండ్‌తో సిరీస్ ఆడాక సమీక్షిస్తా’ అన్నాడు. నవంబరు 15న అహ్మదాబాద్ టెస్టుతో... ఇంగ్లండ్‌తో నాలుగు మ్యాచ్‌ల సిరీస్ మొదలవుతుంది. ‘రిటైర్మెంట్ తర్వాత ఏమిటనే విషయం కూడా నేనెప్పుడూ ఆలోచించలేదు.అసలు ఆ అవసరం రాలేదు. నేనెప్పుడూ ప్రస్తుతం గురించే ఆలోచిస్తాను. రిటైర్మెంట్ అనేది ఎవరికైనా కష్టమైన నిర్ణయమే. నా మనసు ఏం చెబితే అది చేస్తాను. నా శరీరం, ఆటతీరు గురించి చెప్పడానికి నేనే సరైన జడ్జిని. ఇక నేను ఆడలేను అనిపిస్తే... ఆ వెంటనే రిటైర్ అవుతాను’ అని సచిన్ చెప్పాడు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more