రానురాను ఈనేలపై పుట్టినందుకు సిగ్గుపడి భాదపడే రోజులు వస్తాయేమో. రోజురోజుకు ఈనేలను పాలించేనేతలు చేస్తున్న చేతలు, మాట్లాడుతున్న మాటలు వారికి మతిపోయిందేమో అన్పిస్థుండగా, భవిష్యత్ భారతదేశం ఏమయిపోతుంది అన్న భయం కూడా కలిగిస్తోంది. మంత్రులు అనుక్షణం ప్రజలకోసం ఆలోచించి వారి విలువైన సమయాన్ని ప్రజాసంక్షేమం కోసం వెచ్చించాలి. వారి మాటలు భావిభారత పౌరులకు దిశానిర్దేశం చేసేవిగా ఉండాలి. కాని కొందరి వ్యవహారం మొత్తం వ్యవస్థకే మచ్చతెచ్చేవిగా ఉన్నాయి. గల్లీలోని సామాన్యులు కూడా అనకూడని మాటలంటూ సిగ్గుపడేలా చేస్తున్నారు. దీనికి తాజా ఉదహరణ మనరాష్ట్రానికే చెందిన కేంద్రమంత్రి జైరాంరమేశ్. ఇంతకీ అంతకాని మాట ఆయనేం అన్నారంటారా...టాయ్ లెట్లులేని ఇళ్లున్న వారి మగవారిని ఎవరు పెళ్లి చేసుకోవద్దట. ఇది అందరు విధిగా పాటించాలి అంటూ యువతులకు ఆయన పిలుపునిచ్చారు. దేశంలో మరుగుదొడ్ల కన్నా దేవాలయాలే ఎక్కువగా ఉన్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి- నీళ్లు, పారిశుధ్యం శాఖల మంత్రి జైరామ్ రమేష్ వ్యాఖ్యానిస్తే మన నాగరికులకు ఒళ్లు మండింది. మన నాగరికత చాలా చిత్రమయింది! మరుగు దొడ్ల గురించీ మురుగు కాలవల గురించీ మాట్లాడడం ‘నాగరికం’ అనిపించుకోదు మన సమాజంలో. కానీ, అవి లేని కారణంగా జీవితం దుర్గంధభూయిష్టంగా మారిపోవడాన్ని మాత్రం మన ‘నాగరికులు’ పట్టించుకోరు. ఈ దేశంలో మరుగుదొడ్ల కన్నా సెల్ఫోన్లు ఎక్కువగా ఉండడాన్ని తప్పుపడుతూ ఎవరయినా మాట్లాడితే మన వాళ్లు మొహం చిట్లిస్తారు. దేశంలో మరుగుదొడ్ల కన్నా దేవాలయాలే ఎక్కువగా ఉన్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి- నీళ్లు, పారిశుధ్యం శాఖల మంత్రి జైరామ్ రమేష్ వ్యాఖ్యానిస్తే మన నాగరికులకు ఒళ్లు మండింది. బాల్ ఠాక్రే లాంటి మతోన్మాదులు ఓ వంక మంత్రిని విమర్శిస్తూనే మరో వంక దేవాలయాలకు బదులు మసీదులూ చర్చులూ అని ఉంటే బాగుండేదని సవరణ ప్రతిపాదించారు. ఈ దేశంలో హిందూ మతాన్ని గుత్తకు తీసుకున్నట్లు ప్రవర్తించే బీజే పీ కూడా జైరామ్ రమేష్ వ్యాఖ్యను ఘాటుగా ఖండించింది. అంతేతప్ప, మరుగు దొడ్లు లేకపోవడం వల్ల సామాజిక జీవనం ఎంత దుర్భరంగా మారుతోందో ఏ ఒక్కరూ ప్రస్తావించకపోవడం గమనార్హం.
జైరామ్ రమేష్ ప్రకటనను ఖండించే సందర్భంగా బాల్ ఠాక్రే చేసిన కొన్ని విమర్శలను కొట్టిపారేయలేం. గత ఆరున్నర దశాబ్దాల కాలంలో అత్యధిక సందర్భాల్లో కేంద్రంలో అధికారం చేజిక్కించుకున్న పార్టీ కాంగ్రెస్సేనని ఠాక్రే గుర్తు చేశారు. పారిశుధ్య సమస్యలాంటి మౌలిక అవసరాలను తీర్చే దిశగా ఆ పార్టీ ప్రభుత్వాలు చేసింది శూన్యమని ఆయన విమర్శించారు. సులభ్ ఇంటర్నేషనల్ అనే ఎన్జీవో మాత్రం మంత్రి ప్రకటనను గట్టిగా సమర్థించింది. ఈ సంస్థ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ రెండు వారాల కిందట ఓ ప్రకటన చేస్తూ జైరామ్ రమేష్ ప్రకటనను ‘సానుకూలంగా’ తీసుకోవాలని సూచించారు. మన దేశాన్ని బహిరంగ మలమూత్ర విసర్జనల బారినుంచి కాపాడాలన్నదే మంత్రి ప్రకటలన వెనక ఉన్న ఉద్దేశమని పాఠక్ వివరించారు.
అక్టోబర్ 21న- మంత్రిగారు మరో ప్రకటన చేశారు. దేశంలోని యువతీగణాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ‘మరుగు దొడ్లు లేని ఇంటికి కోడలిగా వెళ్లకం’డని ఆయన యువతులకు పిలుపిచ్చారు. రాజస్థాన్ రాష్ట్రంలోని కోట జిల్లా ఖజూరీ గ్రామంలో ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ మంత్రి ఈ ‘తారకమంత్రం’ ఉపదేశించారు. ‘‘పెళ్లికి ముందు మీ పెద్దలు జోస్యులను సంప్రదిస్తారు- పెళ్లి కొడుకు జాతకంలో రాహువు, కేతు సక్రమంగా ఉన్నారో లేదో చూసుకుని మరీ ముహూర్తం నిర్ణయించుకుంటారు. కానీ మీరు పరిగణనలోకి తీసుకోవలసిన విషయం ఒకటుంది. పెళ్లి కొడుకు ఇంట్లో మరుగు దొడ్డి ఉందో లేదో చూసుకుని, అది ఉంటేనే ఆ పెళ్లికి ఒప్పుకోండి!’’ అని జైరామ్ రమేష్ యువతులకు ఉద్బోధించారు.మన దేశం మొత్తం మీద పాతిక కోట్ల ఇళ్లు ఉన్నాయన్నది ఓ అంచనా. వీటిలో 17 కోట్ల ఇళ్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా, ఎనిమిది కోట్ల గృహాలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ మొత్తం ఇళ్లలో 53.20 శాతం గృహాల్లో మొబైల్ ఫోన్లు ఉన్నాయట. మొబైల్ పోన్లు గానీ ల్యాండ్ లైన్లు గానీ ఉన్న ఇళ్ల శాతం 63.20 శాతమని ఓ సర్వేలో తేలింది. అయితే సొంతంగా మరుగు దొడ్లు కలిగి ఉన్న ఇళ్లు కేవలం 47 శాతం కన్నా కొంచెం తక్కువగా ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. వాస్తవానికి అన్ని ప్రైవేటు మరుగు దొడ్లు దేశంలో లేవని కొందరు ప్రతివాదం మొదలుపెట్టారు కూడా. దానిమాట ఎలా ఉన్నా దాదాపు సగం ఇళ్లలో మరుగు దొడ్డి సౌకర్యం లేదనడంలో ఎలాంటి వివాదమూ లేదు.దేశంలో ఇటీవల అంటువ్యాధులు పెచ్చరిల్లుతున్న సంగతి ప్రసార సాధనాలు గొంతుచించుకుని మరీ చెప్తున్నాయి. ముఖ్యంగా, దోమలూ ఈగల్లాంటి క్రిమికీటకాల ద్వారా వ్యాపించే వైరల్ జ్వరాలూ డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియాలాంటి వ్యాధులూ చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకానొక మంత్రి మరుగు దొడ్ల ఆవశ్యకత గురించి మాట్లాడినందుకు సంతోషించాలి. అంతే తప్ప కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నాల వల్ల ప్రయోజనమేమిటి?
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more