హైకోర్టు జస్టీస్ ఎల్ . నరసింహారెడ్డి తన మనసులోని మాటను ఈ రోజు బయట పెట్టారు. ప్రతి సమస్యకు చట్టమే పరిష్కారం కాదు. కొన్ని అంశాల్లో మానవ ధర్మాన్ని పాట్టించాలని ఆయన అన్నారు. హైదరాబాద్ లో ప్రకాశం స్మారక ప్రసంగం నిర్వహించారు. అందులో ‘ఉమెన్-సోషల్ సెక్రెటరీ- క్రిమినల్ లా’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. మనకు చాలా చట్టాలు ఉన్నా.. వాటికి కొన్ని పరిధులున్నాయని ఆయన అంటారు. ప్రజలు అడిగిన కదా అని చట్టాలు చేస్తే సరిపోదు. ముందు ప్రజల్లో మార్పు రావాలి. ఆ మార్పు వచ్చినప్పుడే చట్టం విలువు తెలుస్తోంది. ప్రజలు మారకుండా చట్టం వల్ల మార్పు రావలంటే చాలా కష్టం. ‘‘ ఎవరైన రోడ్డు యాక్సిడెంట్ లో రోడ్డు మీద పడిపోతే అటు వెళ్లే ప్రజలు ఎవరు పట్టించుకోరు, కానీ అతను మరణించిన తరువాత ధర్నాలు, ఆందోళనలు చేసే ప్రజలు ఎంతమంది లేరు’’ ప్రజలు అలా ఉన్నప్పుడు ఎన్ని చట్టాలు చేసిన ఫలితం ఉండదని ఆయన అన్నారు. ప్రక్రుతి ప్రసాదించిన గొప్ప వరం ‘స్త్రీ’.. ఆమె పై చిన్న చూపు తగదు. ఇటీవల పాఠశాల స్థాయి నుంచి ‘లైంగిక విద్యా’ బోధిస్తామని చెప్పారు. అదే జరిగుంటే పిల్లలు తమకన్నా పెద్దవారిని, తోటి వారిని ఏ ద్రుష్టితో చూసేవారో.. అని ఆలోచిస్తేనే భయమేస్తోంది. ఈ రోజుల్లో సినిమాలు.. కట్టుకున్న భార్యతో కలిసి చేసే పరిస్థితుల్లో లేవు. చిన్న తెర ధారావాహికలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. పాఠాంశాల్లో వేమన, సుమతి శతకాలు చేర్చాలనే ఆలోచన వస్తే .. ప్రభుత్వాలు దానిపై చర్చలు జరిపి. మరో ఏడాది చూద్దాంలే అంటాయి. అదే మద్యం విషయంలో రాత్రికిరాత్రే జీవోలు జారీ అవుతాయాని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ పబ్, క్లబ్ లలో పెళ్లి కాని జంటలను ఆహ్వానిస్తున్నారు. అక్కడేదైనా జరగరానిది జరిగితే .. ప్రభుత్వాలపై, పోలీసులపై దుమ్మెత్తిపోయడం పరిపాటిగా మారింది. పది మందిని హత్య చేసిన వ్యక్తికి ఉరి శిక్ష విధించాలని చెబితే చాలు. ఆయా సంఘాలు ప్రాణానికి ప్రాణం సమాధానం కాదని వాదిస్తాయి. ఏదైనా ఘటన జరిగిందని కొవ్వొత్తులు వెలిగిస్తే ఏమౌతుంది? అదే సమస్యను మొగ్గలోనే తుంచివేస్తే.. అసలు సమస్యే ఉండదు కదా అని ఆయన అన్నారు. మెట్రోపాలిటన్ సెషన్ కోర్టు ( క్రిమినల్ కోర్డు) జడ్జీ జి. శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ .. మహిళలపై జరిిన ప్రతి హింసకూ ఎలాంటి శిక్ష ఉండాలో గుర్తించి చట్టాలన్ని తేవాలన్నారు. ఏదైనా ఒక ఘటన జరిగితే టీవీలు దాన్నే పదేపదే చూపించడం .. ఒక రకంగా హింసను ప్రోత్సహించినట్లే అవుతుందన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more