1984 లో ఇందిరాగాంధి హత్య తరువాత ఢిల్లీ లో జరిగిన అల్లర్లలో ఐదుగురు సిక్కులను చంపిన బృందంలో దోషిగా పరిగణించిన కోర్టులో జరుగుతున్న విచారణలో కాంగ్రెస్ నాయకుడు సజ్జన్ కుమార్ ని నిర్దోషిగా డిస్ట్రిక్ట్స్ అండ్ సెషన్స్ జడ్జ్ జె.ఆర్.ఆర్యన్ తీర్పునిచ్చారు. అదే బృందంలో ఉన్న మరో ఐదుగురికి మరణశిక్ష విధించారు. మరణ శిక్ష పొందినవారు, మాజీ కౌన్సిలర్ బలవాన్ ఖొక్ఖడ్, మాజీ శాసనసభ్యుడు మహేందర్ యాదవ్, కిషన్ ఖొక్కడ్, గిర్ధారిలాల్, కేప్టెన్ భగమల్.
తీర్పుని వినిపించిన అనంతరం కోర్టులో అలజడి మొదలై, అసహనంతో ఎవరో జడ్జ్ మీదకు బూటుని విసిరారు. మాజీ పార్లమెంట్ సభ్యుడు సజ్జన్ కుమార్ మీద సాక్ష్యాధారాలు లేవని నిర్దోషిగా తీర్పునివ్వటంతో గందరగోళం ఏర్పడటమే కాకుండా ఫిర్యాదు చేసిన జగ్దీశ్ కౌర్ తనకు న్యాయం జరిగేంతవరకూ అక్కడి నుండి కదలనని మొండిగా కోర్టు హాల్లోనే కూర్చుండి పోయారు.
శిక్షపడ్డ ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని రాజ్ నగర్ ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలో హత్య చేసారు. హత్యగావించబడ్డ వారిలో ఫిర్యాదు దారు జగ్దీశ్ కౌర్ కి కెహర్ సింగ్ భర్త, గురుప్రీత్ సింగ్ కుమారుడు కాగా మిగిలిన ముగ్గురు ఆమె సోదరులు. జరిగిన హత్యాకాండకు ప్రత్యక్ష సాక్షి జగ్దీశ్ కౌర్.
లోగడ దర్యాప్తు చేస్తున్న స్థానిక పోలీసులు కేసుని సిబిఐకి అప్పగించగా, పోలీసులు, సజ్జన్ కుమార్ మధ్య లోపాయి కారి వ్యవహారం తీవ్ర స్థాయిలో జరుగుతోందని కోర్టుకి నివేదించారు. పోలీసులు కొన్ని కేసుల్లో కళ్ళు మూసుకునిపోయి ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నారంటూ సిబిఐ ఆరోపించింది. సజ్జన్ కుమార్ పేరు బయటకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ పోలీసు రికార్డ్ లలో అతని పేరు మాయమైపోయిందంటూ సిబిఐ తెలియజేసింది.
ప్రత్యక్షసాక్షి సాక్ష్యంలో కూడా ఒక్కోసారి ఒక్కోవిధంగా పొంతన లేకుండా ఉందంటూ డిఫెన్స్ వాదించింది. దానితో సజ్జన్ కుమార్ నిర్దోషిగా బయటకు వచ్చారు.
ఇలాంటి సంఘటనలు 1984లో చాలా ప్రదేశాలలో జరిగాయి కానీ వాటిలో అన్నిటికీ సాక్ష్యాధారాలు లేవు. కానీ ఉన్న సాక్ష్యాధారాలు కూడా తారుమారై, పోలీసు రికార్డ్ లలో వివరాలు గల్లంతై చివరకు ఘటన జరిగిన 29 సంవత్సరాలకు బాధితుల మానసిక వ్యధను పెంచుతూ తీర్పు రావటం అత్యంత బాధాకరం.
ఢిల్లీ మొత్తం జరిగిన మారణహోమంలో సిక్కులను ఎక్కడికక్కడ హత్య చేసారు. ఎలా వీలయితే అలా చంపారు. కారులో పోతుంటే ఆపి లోపల తగలబెట్టటమేనా కత్తులతో రాళ్ళతో కొట్టి చంపటమేనా, గురుద్వారా లో తలదాచుకుంటే తలుపులు బయటినుంచి వేసి గురుద్వారాకు నిప్పు అంటించటమేనా, ఇలా ఎన్నో రకాలుగా ఢిల్లీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సిక్కులను వివిధ రకాలుగా హింసించి చంపారు. ఎందరో సిక్కులు ప్రాణాలు దక్కించుకోవటం కోసం రాత్రికి రాత్రి తల మీద కేశాలను, గడ్డాలను రాత్రికి రాత్రే తీయించుకున్నారు. అలాంటి సందర్భాల్లో కనీసం విచారణ ఈ స్థాయి వరకు వచ్చిన సందర్భాల్లో కూడా న్యాయం జరగలేదంటూ బాధితుల కుటుంబీకులు ఆందోళన బాట పట్టారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more