Supreme court directives and dgp tenure

prakash singh vs union govt 2006, supreme court directives, police reforms, dgp dinesh reddy tenure, home minister, sabita indra reddy

supreme court directives and dgp tenure

భద్రతకు ఏడు సూత్రాలు

Posted: 05/05/2013 12:22 PM IST
Supreme court directives and dgp tenure

విద్యార్థుల పర్యటనలో, మానాన్నగారు టైముకి భోజనం చెయ్యమన్నారు అన్నాడట ఒక విద్యార్థి.  అబ్బాయి తండ్రిగారు ఇంకా ఎన్నో జాగ్రత్తలు చెప్పుంటారు కానీ, ఇది తనకీ కావలసిందే కాబట్టి దాన్ని మాత్రం ఠంచన్ గా పాటించాడు ఆ తిండిపోతు. 

భారత ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ ప్రకాశ్ సింగ్ 2006లో దాఖలు చేసిన పిటిషన్ కేసులో సుప్రీం కోర్టు, శాంతి భద్రతలను నెలకొల్పటానికి ఏడు మార్గదర్శకాలను చేసింది.  అందులో మొదటిది రాష్ట్ర భద్రతా కమిషన్ ని నెలకొల్పటం.  ఆ పనిని మాత్రం నిన్న హడావిడిగా తమకే పుట్టిన బుద్ధిలా హోం మంత్రి సిఫారసు చెయ్యటం, ఆ దిశగా ముఖ్యమంత్రి ఆమోద ముద్ర వేయటం జరిగిపోయింది.  పూర్తి చేసిన మరో పని, పోలీస్ ఎస్టాబ్లిష్ మెంట్ బోర్డ్ ని స్థాపించటం.  అందులో పోలీసు ఉద్యోగుల నియామకాలు, బదిలీలు, పదోన్నతుల నిర్ణయాలు జరుగుతాయి.

ఇక పోలీసు శాఖలో అనుసరించవలసిన మిగిలిన మార్గదర్శకాల విషయంలో ఎవరూ ఏమీ మాట్లాడటం లేదు.  ఏమిటా మిగిలిన మార్గదర్శకాలు

3. డిజిపి పదవీ కాలం రెండు సంవత్సరాలకు పరిమితం.  4. ఎస్ పి లు ఎస్ హెచ్ ఓలకు రెండు సంవత్సరాల కాల పరిమితి.  5. దర్యాప్తులు చేసే విభాగం, చట్టాలను అమలుపరచే విభాగాలు విడివిడిగా ఉండాలి. 6. రాష్ట్ర జిల్లా స్థాయిల్లో పోలీస్ ఫిర్యాదుల అధికార కార్యాలయాలను స్థాపించాలి.  7. కేంద్రంలో జాతీయ భద్రతా కమిషన్ ని స్థాపించాలి.  

మరో ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే, డిజిపి వి.దినేష్ రెడ్డి నియామకం 29.9.2012 లో జరిగింది.  అందులో రెండు సంవత్సరాల పదవీకాలం అనేదేమీ సూచించ లేదు.  తమిళనాడు హైకోర్టు ఆదేశాన్నిఅనసరిస్తే, ఆ నియమం ప్రకారం వారి రిటైర్ మెంట్ డేట్ తో సంబంధం లేకుండా రెండు సంవత్సరాల కాల పరిమితిని పాటించాలి.  అంటే 28.9.2014 వరకు డిజిపిగా పనిచేయవచ్చు.  కానీ దినేష్ రెడ్డి కి సెప్టెంబర్ 18, 2013 కి 60 సంవత్సరాలు నిండుతున్నాయి.  నియామకంలో స్పష్టత లేకపోవటం వలన దినేష్ రెడ్డి పదవీ కాలంలో మరోసారి వివాదం చోటుచేసుకోబోతోంది.

మొదటి సారి 2011 లో డిజిపిగా నియామకం జరిగినప్పుడు వచ్చిన వివాదం వలన సెంట్రల్ ఎడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఆయన నియామకాన్ని రద్దు చేసింది.  ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనను 2012 లో డిజిపిగా నియమించింది.

-శ్రీజ

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more