రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ప్రభుత్వంలో, పార్టీలో జరిగే విషయాలేవీ తెలియవట! చీటికి మాటికి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో వ్యక్తిగా ఉండే బొత్స ఇప్పుడు తనకేమీ తెలియదంటూ రూటుమార్చారు. తాను అన్నీ లీక్ చేస్తున్నానంటూ ఆరోపణలు వస్తున్నాయంటూనే ఆ విషయమా? ఏమో... తెలియదే అన్న రీతిలో వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ, ప్రభుత్వ విషయాలపై ఏమడిగినా తెలియదనే సమాధానం తప్ప ఆయన నోటివెంట మరోమాట వినిపించడం లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై గ్రామస్థాయిలో కూడా చర్చించుకుంటుంటే బొత్స మాత్రం తనకేమీ తెలియదంటున్నారు.
వివాదాస్పద జీవోల్లో సుప్రీంకోర్టు నోటీసులందుకున్న మంత్రుల వ్యవహారంగానీ, ఇద్దరు మంత్రులు ధర్మాన, సబితల రాజీనామాలపై కూడా తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మంత్రుల రాజీనామా ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారమని, ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తానెలా చెప్పగలుగుతానని అమాయకంగా జారుకుంటున్నారు. ఢిల్లీ లో పార్టీ అధిష్ఠానం మంత్రుల రాజీనామాలపై ఎలాంటి సంకేతాలు ఇచ్చిందని అడిగినా, ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని ప్రశ్నించినా తెలియదనే మాట మినహా బొత్స నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదు.
ఇలాంటి సమయంలో కూడా అధికారంలో ఉన్న పార్టీకి అత్యున్నత పదవిలో ఉన్న బొత్సకు ఏ విషయం తెలియకపోవడం గమనార్హం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు దోచుకున్న వైకాపా నేతలు బరితెగించి బజారుకెక్కారని పిసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాధనం దోచుకుని జైలుకెళ్ళిన వారు కూడా దిగజారి ఎదుటివారిని విమర్శిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. అలాంటి నేతలకు లేని సిగ్గు తమకెందుకని అన్నారు. సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న మంత్రులు రాజీనామా చేయడం లేదా అని ఒక విలేకరి ప్రశ్నించగా, బొత్స మండిపడ్డారు.
వివాదాస్పదమైన జీవోలన్నింటికీ కేబినెట్ ఆమోదం ఉందని, ఇవి మంత్రుల వ్యక్తిగత నిర్ణయాలు కావని బొత్స స్పష్టంచేశారు. ఈ జీవోల విడుదలలో తమ మంత్రులు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఆయన అన్నారు. వేల కోట్లు దోచుకున్నవారే సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని, తమ మంత్రులు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని బొత్స అభిప్రాయపడ్డారు. మంత్రుల రాజీనామాల వ్యవహారం ప్రభుత్వ పరమైన నిర్ణయమని, ఇది పార్టీకి సంబంధించింది కాదన్నారు.
పీసీసీ కార్యవర్గంలో ఒకరో, ఇద్దరో మారుతారని, అలా మారితేనే కొత్త కార్యవర్గం అనిపించు కుంటుందని బొత్స అన్నారు. వైకాపాలోకి వెళ్ళిన పిసీసీ కార్యవర్గ సభ్యుల ఖాళీలను భర్తీ చేస్తున్నారా? అని అడిగితే వెంటనే, పిసీసీ కార్యవర్గానికి గరిష్ఠ పరిమితి లేదని, ఎంతమందినైనా నియమించుకోవచ్చునని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more