యుపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ పై ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ ఘాటైన విమర్శలు చేశారు. యుపిఏ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతిలో మునిగి తేలుతూ ప్రజాజీవితాన్ని దుర్భరం చేయటం తప్పించి సాధించిందేమీ లేకపోయినప్పటికీ ఉత్సవాలను చేసుకోవటం విడ్డూరంగా ఉందని లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ ఎద్దేవా చేశారు. తన అసమర్థ పాలనతో దేశాన్ని అన్ని విధాలా భ్రష్టుపట్టించామని ఒప్పుకుని ప్రధాని ప్రజలకు క్షమాపణ చెప్పాలని సమావేశంలో డిమాండ్ చేశారు.
యుపీఏ-2 ప్రభుత్వం నాలుగేళ్ల పాలనపై సుష్మ దుమ్మెత్తిపోశారు. దేశానికి నాయకత్వం లేకుండా పోయిందని ఆమె ప్రధాని మన్మోహన్సింగ్పై విరుచుకుపడ్డారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగానే తప్పించి సమర్థత గల నాయకుడు కాదని ఆమె తేల్చేశారు. ఇటు పార్టీ అటు ప్రభుత్వంలో తనకంటూ మన్మోహన్కు ఎలాంటి గుర్తింపూ లేదన్న సుష్మ ఆయనకు నాయకత్వ లక్షణాలు లేక పోవటంతో దేశం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని ధ్వజమెత్తారు.
సంకీర్ణ ప్రభుత్వాల ఆవిర్భావం అనివార్యమైన సమయంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్ధవంతంగా నడిపించటానికి అవసరమైన లక్షణాలు మన్మోహన్కు లేవని బిజెపి నాయకురాలు స్పష్టం చేశారు. ‘ఆయన ప్రధాని మాత్రమే.. నాయకుడుకాదు’ అని సుష్మా స్వరాజ్ వ్యాఖ్యానించారు. అలాగే రాజకీయ నిర్ణయాలు తీసుకోగల స్వేచ్ఛ సింగ్కు లేదని ఆమె అన్నారు. చివరికి మంత్రివర్గలోని భాగస్వామ్య పక్షాలు తుది నిర్ణయంకోసం యుపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ దయాదాక్షిణ్యలపై ఆధారపడుతుంటారని ఆమె వ్యంగ్యంగా అన్నారు. ప్రధాని, సోనియాగాంధీల అధికార కేంద్రాలు విడివిడిగా ఏర్పడటం పరిస్థితులు దిగజారిపోతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్డీఏ ప్రభుత్వం అప్పగించిన పటిష్టమైన ఆర్థిక వ్యవస్థను మన్మోహన్ సర్కార్ పూర్తిగా నాశనం చేసిందని ఆమె ఆరోపించారు. ఎన్డీయే హయాంలో రహదారుల నిర్మాణంతో పాటు ప్రాథమిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం లభించటంతో ఉపాధి అవకాశాలు పెరిగాయని ఆమె గుర్తుచేశారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలు మెరుగుపరచుకోవటంలో యుపీఏ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, భారత్ కంటే చిన్న దేశాలైన మాల్దీవులు, బంగ్లాదేశ్ కవ్వించే స్థితికి చేరుకున్నాయని ఆమె తెలిపారు. దేశ అంతరంగిక భద్రత ప్రమాద స్థితికి చేరుకుందని సుష్మా స్వరాజ్ విరుచుకుపడ్డారు.
పార్లమెంట్ సమావేశాలను సాఫీగా నడిపించలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉందని చెబుతూ స్వతంత్ర భారత దేశ చరిత్రలోఇంతటి అవినీతి ప్రభుత్వం ఇంతవరకూ చూడలేదని ఆమె నిప్పులు చెరిగారు. భవిష్యత్లో చూసే అవకాశం రాదని ఆమె ఎద్దేవా చేశారు. యుపీఏ కబంధ హస్తాల నుంచి దేశాన్ని విముక్తి చేయటానికి బిజెపి నిరంతర పోరాటం చేస్తుందని ఆమె ప్రకటించారు. లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీకి నాయకత్వం వహించే వ్యక్తి పేరును సరైన సమయంలో పార్లమెంటరీ బోర్డు ప్రకటిస్తుందని ఆమె స్పష్టం చేశారు.
సీనియర్ నాయకుడు అద్వానీతో సహా సమర్ధులైన అనేక మంది తమకున్నారని ఆమె అన్నారు. ‘మాకు నేతృత్వం వహించే వ్యక్తి గురించి మీరు ఆదుర్ధాపడవలసిన అవసరం లేదు’ అని సుష్మ మీడియాకు చురకేశారు. వాజపేయి కారణంగా అప్పుడు అధికారంలో చేపట్టగలిగారు, ఇప్పుడు ఆయనతో సరితూగ గల నాయకత్వం ఉందా? అని ప్రశ్నించగా వేచి చూడండని ఆమె జవాబు ఇచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more