అరవై సంవత్సరాల పాటు సాగిన కథకు ఆఖరి అంకానికొచ్చింది. 60 సంవత్సరాల పోరు సమస్యకు నేడు పరిష్కారం విడుదల కాబోతుంది. నేడే విడుదలై ప్రకటన కోసం తెలంగాణ ప్రజలు, నాయకులు ఆశగా ఎదురుచూస్తున్నార. టి పై నిర్ణయం మరికొన్ని గంటల్లోనే రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ పార్టీ తుది నిర్ణయం వెలువరించడానికి సిద్దమైంది. ఇందులో భాగంగా అత్యంత కీలక భేటీలకు ఈరోజు ముహూర్తం ఖరారు చేసింది. ఈరోజు సాయంత్రం 4గంటలకు ప్రధాని నివాసంలో యుపిఎ మిత్రపక్షాల భేటీ, 5.30 గంటలకు సోనియా ఇంట్లో సిడబ్ల్యుసి సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి నేతలందరికీ ఆహ్వానాలు వెళ్లినట్లు సమాచారం. బొత్స ఇప్పటికే ఢిల్లీలో మకాం వేయగా.. నేడు సిఎం కిరణ్ హస్తినకు చేరుకోనున్నారు.
రాహుల్ తో భేటికి సీమాంద్ర నేతల యత్నం
ఇటీవల ప్రధాన మంత్రిని కలిసిన సీమాంద్ర నాయకులు ఈరోజు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవడానికి ప్రయత్నిస్తోంది. కావూరి సాంబ శివరావు, పళ్లం రాజు, పురంధేశ్వరి , అనంత వెంకట్రామిరెడ్డి, లగడపాటి రాజగోపాల్ కనుమూరి బాపిరాజు తదితరులు రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కోసం ఇప్పటికే విజ్జప్తిచేశారు.
ఆంగ్ల పత్రిక కథనం
తెలంగాణ అంశంపై నేడు తుది నిర్ణయం వెలువరిస్తామని ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ ఇప్పటికే ప్రకటించారు. కాగా, పది జిల్లాలతో కూడిన తెలంగాణకే కేంద్రం మొగ్గు చూపుతున్నట్లు ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది. తెలంగాణ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపుతోందని. దీనికి ఆమోద ముద్ర వేయించుకునేందుకే మిత్ర పక్షాలను సంప్రదిస్తోందని తెలిపింది. అయితే విభజన జరిగితే కాంగ్రెస్ లోనే వ్యతిరేకత వ్యక్తం కావొచ్చని పేర్కొంది.
యుపిఎ మిత్రపక్షాల మద్దతు
ఇప్పటికే యుపిఎ మిత్రపక్షాలు ఎన్ సిపి, ఆర్ ఎల్ డి తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ప్రకటించాయి. మరో వైపు కేంద్ర మంత్రి అజిత్ సింగ్ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇక,తెలంగాణ డిమాండ్ ను మిగతా రాష్ట్రాలతో ముడిపెట్టడం సరికాదని ఎన్ సిపి ప్రధాన కార్యదర్శి తారిఖ్ అన్వర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.ఏదేమైనా రాష్ట్ర రాజకీయాల్లో ఈరోజు కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు సాయంత్రంకల్లా తెలంగాణ భవిష్యత్తు తేలే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పది జిల్లాలా? పన్నెండు జిల్లాలా?
తెలంగాణ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం.. నాటి యూపీఏ సమన్వయ కమిటీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల్లో రాష్ట్ర విభజన ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నట్లు అభిజ్ఞ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత.. కొత్తగా ఏర్పాటయ్యే రెండు రాష్ట్రాలకు ఐదు లేదా పది సంవత్సరాల పాటు హైదరాబాద్ నగరాన్ని ఉమ్మడి రాజధానిగా ఉంచుతారని చెప్తున్నారు. అయితే.. తెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాలతోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందా? లేక రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలను కూడా కలిపి పన్నెండు జిల్లాలతో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తారా? అన్న అంశంలో ఇంకా ఎలాంటి స్పష్టత లభించటం లేదు. కొత్త రాష్ట్రాలకు హైదరాబాద్ రాష్ట్రంగా, ఆంధ్ర రాష్ట్రంగా నామకరణం చేస్తారనే ప్రచారం సాగుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more