తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై కేంద్ర మంత్రి మండలి నోట్ సిద్ధమైందని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. ఆ నోట్ ను ఈ రోజు పరిశీలిస్తామన్నారు. హైదరాబాద్ గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని షిండే చెప్పారు. ఈ రోజు సాయంత్రం జరగవలసిన కేంద్ర మంత్రి మండలి సమావేశం రేపటికి వాయిదా పడిన విషయం తెలిసిందే. ముఖ్యమైన కేంద్ర మంత్రులు కొందరు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ సమావేశం రేపటికి వాయిదాపడింది. మంత్రి మండలి సమావేశం ఎజెండాలో తెలంగాణ అంశం లేదని తెలుస్తోంది. ఈ నోట్ ను రేపు జరిగే మంత్రి మండలి సమావేశంలో పరిశీలనకు వస్తుందో, రాదో స్పష్టంగా తెలియడంలేదు. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన తరువాత ప్రధానంగా హైదరాబాద్ పైనే చర్చ జరుగుతోంది. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా ఒక్క హైదరాబాద్ విషయంలోనే పీటముడి పడింది. ఆరు దశాబ్దాలుగా రాజధానిగా ఉన్న హైదరాబాద్‌పై హక్కులు ఎవరివనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. ఈ నేపధ్యంలో హైదరాబాద్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని షిండే చెబుతున్నారు. హైదరాబాద్ విషయం తేలకుండా విభజన అంశం తేలడం కష్టం.
లగడపాటికి సుప్రీంలో ఊరట
సుప్రీం కోర్టులో లగడపాటికి రాజగోపాల్ కు ఊరట లభించింది. ఆయన ఎన్నిక చెల్లందంటూ వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. లగడపాటి ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారంటూ న్యాయవాది సుంకర కృష్ణమూర్తి కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిగిన అనంతరం ఈ పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more