రాష్ట్రానికి చెందిన ఇద్దరు ముఖ్యనాయకులకు పుట్టినిల్లు .. చిత్తూరు జిల్లా. ఒకరు ప్రస్తుత్త ముఖ్యమంత్రి నల్లారి కుమార్ రెడ్డి, మరోకరు.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇప్పటి వరకు ఈ ఇద్దరు రాజకీయాల్లో పెను సంచలనం స్రుష్టించారు. అయితే అదే రీతిలో.. వారి జిల్లాను పేరు కూడా దేశానికి సరికొత్త పరిచయం చేశారు. ఇప్పుడు చిత్తూరు జిల్లా .. ఉగ్రవాదులకు అడ్డగా మారింది. ఈరోజు ఉదయం చిత్తూరు జిల్లా పుత్తూరులోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు తలదాచుకురన్న సమాచారం తో తమిళనాడు పోలీసులు, స్థానిక పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో తుపాకి, రెండు బాంబులను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. తనిఖిలకు వచ్చిన పోలీసులపై అనుమానితులు కత్తి, రాళ్లతో దాడి చేయడంతో సీఐకు తీవ్ర గాయాలయ్యాయి.
అనుమానితులు ఇంట్లోనే ఉండి లోపలికి ప్రవేశించిన పోలీసులపై దాడికి యత్నిస్తున్నారు. దాదాపు 60 మంది పోలీసులు అర్థరాత్రి నుంచి ఇంటిని చుట్టుముట్టి అనుమానితులను అదుపులోకి తీసుకునేందుకు యత్నిస్తున్నారు. తలదాసుకున్నది ఐఎస్ఐ ఉగ్రవాదులే నన్న అనుమానంతో ఎస్ఐబీ అధికారులు కూడా పుత్తూరు చేరుకున్నారు. జిల్లా ఎస్పీ కాంతిరాణా, తమిళనాడుకి చెందిన ఎస్ఐబీ ఎస్పీ, తిరువలూరు ఎస్పీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పుత్తూరుకు ఆక్టోపస్ బలగాలను తరలించినట్లు డీజీపీ ప్రసాదరావు తెలిపారు. తమిళనాడు పోలీసులతో కలిసి స్థానిక పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
గాయపడిన సిఐ మ్రుతి
ఉగ్రవాదుల దాడిలో గాయపడిన సీఐ లక్ష్మణ్ మరణించారు. అర్థరాత్రి ఉగ్రవాదుల దాడిలో తీవ్రంగా గాయపడిన లక్ష్మణ్ ను హుటాహుటీన చెన్నై ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన చికిత్స పొందుతూ సిఐ చనిపోయారు.
ఐఎస్ ఐ ఉగ్రవాది బిలాల్ ?
పుత్తూరులో తమిళనాడు పోలీసులు ముట్టడించిన ఇంట్లో ఐఎస్ ఐ ఉగ్రవాది బిలాల్ ఉన్నాడని సమాచారం. ఇటీవల సేలంలో జరిగిన బీజేపీ నేత హత్య కేసులో బిలాల్ నిందితుడు. ఇతడితో పాటు మరికొందరు ఆ ఇంట్లో దాక్కొన్నారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తమిళనాడు పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. కాల్పులు జరుగుతుండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. స్థానికులను ఆ ప్రాంతం నుండి తరలించారు. మీడియాను కూడా అనుమతినివ్వడం లేదు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆక్టోపస్ బలగాలు - డీజీపీ
చిత్తూరు జిల్లా పుత్తూరుకు ఆక్టోపస్ బలగాలను తరలించినట్లు డీజీపీ ప్రసాదరావు పేర్కొన్నారు. తమిళనాడు పోలీసులతో కలిసి స్థానిక పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more