Opposition from within aap

Opposition from within AAP, Vinod Kumar Binny, Arvind Kejriwal, Delhi Laxminagar Constituency, Delhi ruling party AAP

Opposition from within AAP

ఆమ్ ఆద్మీ పార్టీలో ముసలం

Posted: 01/16/2014 10:17 AM IST
Opposition from within aap

పార్టీ అధికారంలోకి వచ్చి పట్టుమని పదిరోజులైనా అయ్యాయో లేవో అప్పుడే ఆమ్ ఆద్మీ పార్టీలో ముసలం ఏర్పడింది- అదీ పార్టీ విధానాల పట్ల శాసన సభ్యుడి నిరసన గళం రూపంలో.   ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన వాగ్దానాలను ఆ పార్టీ నెరవేర్చే దిశగా ఏమాత్రం ప్రయత్నాలు చెయ్యటం లేదంటూ అదే పార్టీకి చెందిన లక్ష్మీనగర్ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహించే శాసన సభ్యుడు వినోద్ కుమార్ బిన్నీ ఆరోపించారు. 

ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికలకు ముందు చెప్పింది ఒకటి ఇప్పుడు చేస్తున్నది మరొకటి అంటూ అభియోగాలను చేసిన వినోద్ కుమార్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలోనూ ఏదో ఒక ఆంక్ష విధిస్తూ దాన్ని నిర్వీర్యం చేస్తున్నారని చెప్తూ అందుకు నిరసనగా నిరాహార దీక్షను చేస్తానంటున్నారు. 

అయితే నిరసనకు అసలు కారణం ఆయనకు పదవి లభించకపోవటమేనన్న విషయం ప్రస్ఫుటంగానే కనిపిస్తోంది.  ఢిల్లీ క్యాబినెట్ జాబితా తయారు చేసినపుడు అందులో వినోద్ కుమార్ పేరు లేకపోవటంతో ఆ సమయంలో కూడా తన వ్యతిరేకతను ప్రదర్శించిన ఆయన బుధవారం తీవ్ర స్థాయిలో పార్టీ విధానాల మీద విరుచుకుపడ్డారు. 

రాజకీయాలలో వచ్చే పెద్ద సమస్యలలో ఇదొకటి.  పార్టీకి అధికారం వచ్చేంత వరకు అందరూ కలిసే పనిచేస్తారు.  తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతివారూ ఆ అధికారంలో భాగస్వామ్యం కావాలంటారు.  ఒక్కో నియోజక వర్గంలో ఒక్కరే నిలబడతారు.  అసలు ఆ సమయంలోనే నాయకత్వనికి పెను సవాలు ఎదురౌతుంది ఎవరికి టికెట్ ఇవ్వాలా అని.  అయితే అధికారంలో ఉన్న పార్టీలోకంటే అధికారంలో లేని పార్టీలో ఆ పని త్వరగానే జరిగిపోతుంది. 

కానీ గెలిచిన ప్రతి ప్రజాప్రతినిధీ మంత్రి పదవిని కోరుకుంటే నాయకత్వానికి అది ఎలా సాధ్యమౌతుంది?  ఇక బుజ్జగింపులూ, వాగ్దానాలు జరుగుతాయి! 

అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగతంగా పెంచుకున్న పరపతి వలనే పార్టీకి గుర్తింపు వచ్చినా, పార్టీని నిలబెట్టుకోవటానికి అది ఒక్కటే సరిపోదు.  నిజమైన నాయకత్వ లక్షణం అక్కడే తెలుస్తుంది.  అయితే నాయకత్వం ఎంత లోప రహితంగా ఉన్నా, అధికారం కోసమే రాజకీయాలలోకి వచ్చేవారిని మరోదానితో బుజ్జగించటం కూడా సాధ్యంకాని పనే.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles