Shinde calls kejriwal as mad cm

Shinde calls Kejriwal as mad CM, AAP Kejriwal, Arvind Kejriwal, Sushil Kumar Shinde, Home Minister Shinde, Delhi CM Arvind Kejriwal

Shinde calls Kejriwal as mad CM

కేజ్రీవాల్ ని పిచ్చి ముఖ్యమంత్రన్న షిండే

Posted: 01/22/2014 05:29 PM IST
Shinde calls kejriwal as mad cm

ఉపన్యాసమంటే ప్రేక్షకులను ఆకట్టుకునేదిగా ఉండాలన్నది నిజమే కానీ దానికోసం ఇతర నాయకుల మీద వివిధ రకాలుగా విమర్శలు గుప్పించటం, అందులో హాస్యం వ్యంగ్యాల పాలు కాస్త ఎక్కువ మోతాదులో రంగరించటం చేస్తున్నారు.  రాజకీయ నాయకులకు ఈ మధ్య కాలంలో ప్రతిపక్షాలు, వైరి నాయకుల మీద ఛలోక్తులు విసరటం దానితో అక్కడున్న శ్రోతలను నవ్వించే ప్రయత్నం చెయ్యటం పరిపాటైపోయింది.  

మహారాష్ట్రలో హింగోలీలో ఉపన్యాసం ఇస్తున్న కేంద్ర మంత్రి హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే కేజ్రీవాల్ పేరు ఎత్తకుండానే ఆయన మీద ఎత్తిపొడుపులను సంధించారు.  ఆయన తను పోలీస్ శాఖలో పనిచేస్తున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, ఖేర్వాడీలో డ్యూటీ చేస్తున్న సమయంలో తనకు పెళ్లైన వెంటనే శలవుని రద్దు చేసుకోవలసి వచ్చిందట.  అప్పుడు జరుగుతున్న ఆందోళనలే అందుకు కారణమట.  అలాగే ఒక పిచ్చి ముఖ్యమంత్రి చేష్టల వలన ఢిల్లీలో పోలీసుల శలవులను రద్దు చేసి డ్యూటీలోకి పిలిపించవలసి వచ్చిందని షిండే అన్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles