ఈరోజు పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పై మూజువాణి పద్దతిలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. అయితే రెండు రాష్ట్రాలను ఏర్పాటు చేసే విషయంలో కేంద్రం చాలా జాగ్రత్త ముందుకు పోతుంది. అయితే పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని ఉంటుంది కాబట్టి, ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
విభజన బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందినప్పటికీ… రాష్ట్రపతి ప్రకటించే ‘అపాయింటెడ్ డేట్’ నుంచే విభజన అధికారికంగా అమలులోకి రానుంది. . ఈ నెల 21వ తేదీతో ముగిసే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ఆమోదం పొందినప్పటికీ, రాష్ట్ర విభజన మాత్రం అధికారికంగా జూన్‌లోనే జరుగుతుందని తెలుస్తోంది.
ఇప్పటికిప్పుడు రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకపోవడమే దీనికి కారణం. వచ్చేనెల మొదటివారంలోనే ఎన్నికల షెడ్యూలు వెలువడే అవకాశం కనిపిస్తోంది. మన రాష్ట్రానికి సంబంధించి ఏప్రిల్‌లో పోలింగ్ జరగవచ్చు.
ఈ లోపు రాష్ట్రం విడిపోయినట్లు అధికారికంగా ప్రకటిస్తే ఎన్నికలు జరపటంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతాయి. రెండు రాష్ట్రాల్లోనూ నియోజకవర్గాల పునర్విభజన, షెడ్యూల్ కులాలు, తెగల సీట్ల మార్పులు, చేర్పుల తర్వాతే ‘కొత్త రాష్ట్రాలకు’ ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి కావటానికి కొన్ని నెలల సమయం పడుతుంది.
అప్పటివరకు ఎన్నికలు వాయిదా వేయటం సాధ్యంకాదని కేంద్ర ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరిపి, మొదటిసారి శాసనసభ కొలువుదీరిన తర్వాత అపాయింటెడ్ డేట్ ప్రకటించి అప్పటి నుంచి రెండు రాష్ట్రాలు, రెండు శాసనసభలు ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.
ఇలా చేస్తే నియోజకవర్గాల పునర్ విభజన తాత్కాలికంగా వాయిదా పడుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరిపితే… ఎన్నికల అనంతరం రెండు ప్రభుత్వాల ఏర్పాటు సులువు అవుతుందని కేంద్రం నిర్ధారణకు వచ్చింది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను 2019 ఎన్నికల నాటికి చేసుకోవచ్చునని యోచిస్తోంది. ప్రస్తుతానికి ఎన్నికల ప్రక్రియ సాఫీగా జరగాలనే ఉద్దేశంతోనే అపాయింటెడ్ డేట్‌ను ఎన్నికల తర్వాత ఉండేలా చూసుకోవాలని కేంద్ర హోం శాఖ నిర్ధారణకు వచ్చింది. సంపూర్ణ తెలంగాణ రాష్ట్రం ఇవ్వటానికి అప్పటికి రెఢీ అవుతుందని కేంద్ర ప్రభుత్వం అంచన వేసినట్లు సమాచాం.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more