సానుభూతి తో గెలిచిన వైఎస్ విజయమ్మ గురించి తెలిసిందే. అయితే జరిగిన ఎన్నికల్లో మాత్రం విజయమ్మకు సానుభూతి.. షేక్ హ్యాండ్ ఇవ్వకపోవటంతో ఓటమి రుచి చూసి బొళ్లున కన్నీరు పెట్టుకున్నారు. విజయమ్మ ఓటమి ..వైసీపి నేతలు షాక్ తిన్నారు. దీంతో జగన్ పార్టీలో అందరు మౌన పాటించారు. కానీ విజయమ్మ మరోసారి అద్రుష్టం తలుపుతట్టింది.
అంటే విజయమ్మకు దివంగత శోభా నాగిరెడ్డి రూపంలో గెలుపు అవకాశం దక్కింది. ఎన్నికలకు ముందు ఘోరమైన రోడ్డు ప్రమాదంలో శోభా నాగిరెడ్డి మరణించిన విషయం తెలిసిందే. అప్పటికే ఎన్నికల లాక్ పడిపోవటంతో ఎన్నికల సంఘం ఏ అభ్యర్థికి అవకాశం ఇవ్వలేదు. ఒకవేళ శోభా నాగిరెడ్డి గెలిస్తే.. మళ్లీ ఉప ఎన్నికలు జరుగుతాయని ప్రకటించటం జరిగింది. దీంతో జగన్ పార్టీలోని ఊపీరి పీల్చుకున్నారు. ఎట్ట మనమే అధికారంలోకి వస్తాం కాబట్టి, ఆళ్లగడ్డ గురించి తరువాత ఆలోచిస్తామని వైసీపీ ఎన్నికల బరిలోకి దిగటం జరిగింది.
ఇప్పుడు ఆళ్లగడ్డ పై జగన్ సరికొత్త ప్రయోగం చేయటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఓటమితో .. కుమిలిపోతున్న తల్లిని .. ఆళ్లగడ్డ నుంచి గెలుపించుకోవాటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇడుపులపాయ సమావేశంలో జగన్ మోహన్ రెడ్డిని ఆ పార్టీ సీఎల్పీ నేతగా ఆ పార్టీ ఎమ్మెల్యేలందరూ ఎన్నుకోగా జగన్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కొనసాగనున్నారు.
అయితే జగన్ మీద ఉన్న కేసులు మళ్ళీ విచారణకు వచ్చి.. బెయిల్ మీద బయట ఉన్న జగన్ మళ్ళీ జైలు పాలయితే పార్టీలో రెండో స్థానం ఎవరిది అనే దానిమీద కొందరు సీనియర్ నేతలు అప్పుడే అనుమానాన్ని వ్యక్తం చేయటంతో జగన్ అమ్మకు గెలుపు ముఖ్యమని గుర్తించినట్లు తెలుస్తోంది. అందుకే తన తర్వాత మరొక బయట వ్యక్తిని నమ్మి పార్టీని అప్పగించని జగన్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాకు కూడా అమ్మ విజయమ్మనే ఉంచాలనే ఉద్దేశంతో ఉన్నట్లు పార్టీలోని సీనియర్ నాయకులు అంటున్నారు.
కానీ పార్టీలోని జగన్ సన్నిహితులు మాత్రం .. వైఎస్ విజయమ్మ కన్నా చెల్లెమ్మ షర్మిల అయితేనే బాగుంటందని ఉచిత సలహా ఇవ్వటంతో.. ఒక్కసారి జగన్ వారి పై తీవ్రస్థాయిలో మండిపడినట్లు తెలుస్తోంది. షర్మిల వద్దు.. అమ్మకే కరెక్ట్ అని గట్టిగా చెప్పినట్లు పార్టీ కార్యకర్తలు అంటున్నారు.
అయితే ఇక్కడ మరో సమస్య జగన్ ఎదురవుతుందని .. పార్టీలోని పెద్దలు అంటున్నారు. ఒకవేళ శోభా నాగిరెడ్డి కుటుంబం నుండి ఎవరైన పోటికి దిగితే పరిస్థితి ఏమిటి? వారిని కాదని .. టిక్కెట్ విజయమ్మకు ఇస్తే జనం ఓట్లు వేస్తారా? నాగిరెడ్డి కుటుంబానికి ఇతర పార్టీలో గాలం వేస్తే? మన పార్టీ పరిస్థితి, విజయమ్మ గెలుపు.. బొమ్మ తిరిగి మనకు మైండ్ బ్లాక్ అవుతుందని జగన్ హితబోద చేసినట్లు తెలుస్తోంది. దీంతో జగన్ సందిగ్ధంలో పడినట్లు పార్టీలోని కార్యకర్తలు అంటున్నారు.
కాగా శోభా తరపున మొన్నటి ఎన్నికలలో ప్రచారం చేసిన భూమా పెద్ద కూతుర్నే అభ్యర్ధిగా ఉంచాలని ఆళ్లగడ్డ వైకాపా కార్యకర్తల బలంగా ..వైఎస్ జగన్ కు వినిపించినట్లు పార్టీలోని పెద్దలు గుసగుసలాడుకుంటున్నారు.
ఒకవేళ శోభా నాగిరెడ్డి కుటుంబ సభ్యలు, ఆళ్లగడ్డ వైకాపా కార్యకర్తలు విజయమ్మకు మద్దుతు ఇస్తే మాత్రం.. ఆమె గెలుపు ఖాయం. అప్పుడు దివంగత వైఎస్ సానుభూతి గెలిపించింది. ..మళ్లీ ఇప్పుడు శోభా నాగిరెడ్డి సానుభూతి గెలిపిస్తుంది. అప్పుడు పులివెందుల..ఇప్పుడు ఆళ్లగడ్డ. ఇక వైఎస్ విజయమ్మ ఆళ్లగడ్డ ప్రయోగం ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూద్దాం.
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more