Sabbam hari to join in bjp

sabbam hari, sabbam hari wiki, sabbam hari profile, sabbam hari joins bjp, sabbam hari bjp, sabbam hari congress, sabbam hari ysr congress, sabbam hari on jagan, andhrapradesh, andhrapradesh bjp, bjp, telangana bjp, bjp on telangana, vishakapatnam, vishakapatnam wiki, vishakapatnam tourism places, vishakapatnam locations, vishakapatnam trains, vishakapatnam buses, vishakapatnam route, latest news, vishakapatnam corporation, jai samaikyandhra party

ex mp sabbam hari to join in bjp very soon says party leaders of vishakapatnam : bjp eagerly waiting for sabbam hari joining in bjp to strengthen party in uttarandhra area

హరి నామస్మరణలో ఏపీ బీజేపీ

Posted: 10/07/2014 10:40 AM IST
Sabbam hari to join in bjp

కేంద్రంలో ఒంటిచేత్తో ప్రభుత్వాన్ని నడుపుతున్నా.., తెలుగు రాష్ర్టాల్లో మాత్రం బీజేపికి ఆశించిన స్థానాలు రాలేదు. అయితే గతంతో పోలిస్తే ఈ సారి పరిస్థితి కాస్త మెరుగయిందనే చెప్పాలి. తెలంగాణలో పార్టీ కేడర్ బలపడుతుండగా.., ఏపీలో కూడా అందుకు తగ్గట్లు పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం బలమైన నేతలను ఇతర పార్టీల నుంచి లాగేపనిలో సీనియర్ నేతలు బిజీగా ఉన్నారు. ఇందులో ప్రధానంగా మాజి ఎంపీ సబ్బం హరిని బీజేపి ఆకర్షిస్తోందట. ఆయన కూడా కమలం వాసన చూడాలని తహతహలాడుతున్నాడని గుసగుసలు విన్పిస్తున్నాయి.

సబ్బం హరిని పార్టీలోకి చేర్చుకోవటం వెనక బీజేపికి పెద్ద వ్యూహమే ఉంది. ప్రధానంగా చూసుకుంటే త్వరలో విశాఖ కార్పోరేషన్ ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో గతంలో జీవీఎంసీ చైర్మన్ గా పనిచేసిన అనుభవం ఉన్న హరిని పార్టీలో చేర్చుకుంటే తమకు విశాఖలో బలం పెరుగుతుందని నాయకత్వం భావిస్తోంది. అటు హరి వెలమ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావటం కలిసివచ్చే మరొక అంశం. విశాఖ సహా ఉత్తరాంధ్రలో వెలమ వర్గం వారు ఎక్కువగా ఉన్నారు. సామాజిక వర్గంపై పట్టు ఉన్న సబ్బంను కలుపుకుపోతే.., ఆ వర్గంలోని ఓట్లు తమకే వస్తాయని కమల నేతలు భావిస్తున్నారు. ఇక ఇతర సామాజికవర్గ నేతలతో కూడా సబ్బం హరికి సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో వారి ఓట్లు కూడా బోనస్ గా వస్తాయని లెక్కలు కూడా వేసుకుంటోంది.

ఇక మరొక కారణం ఏమిటంటే.. సార్వత్రిక ఎన్నికల సమయంలో విశాఖ నుంచి ఎంపీగా పోటికి దిగిన హరి.., చివరలో బరినుంచి తప్పుకుని బీజేపీ నేత హరిబాబుకు మద్దతు ప్రకటించారు. తనకు ఓటేయాలనుకునేవారు హరిబాబుకు వేయండి అని బహిరంగంగానే చెప్పారు కూడా. ఇలా బీజేపికి విశాఖ ఎంపీ సీటు విజయంలో సహకరించారు కాబట్టి ఆయన సేవలను పార్టీ వినియోగించుకోవాలని భావిస్తోంది. అందుకోసమే సీనియర్ నేతలు పలవురు హరితో రహస్యంగా సమావేశమై చేరికపై చర్చించారట. మాజి సీఎం కిరణ్ స్థాపించిన ‘ జై సమైక్యాంధ్ర’ పార్టీలో ప్రస్తుతం హరి కొనసాగుతున్నారు. త్వరలోనే ఈ పార్టికి రాజీనామా చేసి బీజేపిలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఈ చేరిక అటు హరికి కలిసివచ్చే పరిణామం కాగా ఇటు బీజేపికి కూడా పార్టీ పరంగా ప్లస్ అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vishakapatnam  sabbam hari  bjp  latest news  

Other Articles