Former central minister to join bjp

narendra modi, sasi tharoor, love letters, kerala congress, former central minister, prime minister

former central minister sasi tharoor alleged of writing love letters to PM modi

కేంద్ర మాజీ మంత్రికి బీజేపి గాలం..?

Posted: 10/08/2014 12:20 PM IST
Former central minister to join bjp

కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రిని టార్గెట్ చేసిన బీజేపి నేతలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అతనిపై విమర్శలను, ఆరోపణలను సంధించడం మానేశారు. కేంద్రంలో పార్టీని ఒంటి చేత్తే నడిపించి సంపూర్ణ మోజారిటీ తీసుకువచ్చి అధికారంలోకి తీసుకువచ్చిన తమ నాయకుడు, దేశ ప్రధాని నరేంద్రమోడీ అతడికి సవాల్ చేయడంతో బీజేపి నేతలు విస్మయం చెందారు. స్వచ్ఛ భారత్ లో తొమ్మిది మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఏడాదిలో 100 రోజులు ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ప్రధాన మంత్రి సవాల్ చేశారు. వారిని కూడా మరో తొమ్మిది మందికి సవాల్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో తెరమీదకు వచ్చిన నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్.

ఐక్యరాజ్యసమితిలో విధులు నిర్వహించిన శశిథరూర్ ను కేంద్రంలోని అప్పటి యూపీఏ సర్కార్ కేంద్రమంత్రిని చేసింది. అప్పటికే పలు వివాదాలకు కేంద్ర బిందువుగా, కేరాఫ్ అడ్రస్గా వున్న ఆయనకు ప్రధాని నరేంద్రమోడీ సవాల్ విసరడమేంటి..? ఆయనను బట్టలోకి దింపి.. పార్టీలోకి వచ్చేందుక బీజేపి నేతలు గాలం వేస్తున్నారా..? అంటే అవుననే సమాధానాలు వినబడుతున్నాయి. త్వరలోనే ఆయన పార్టీ మారబోతున్నారని ? కూడా వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆయన నుంచి ప్రేమలేఖలు వెళ్తున్నాయని కేరళ కాంగ్రెస్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

పార్టీ మారే వ్యవహారాన్ని శశి థరూర్ కూడా పరోక్షంగా బలపరిచారు. కాంగ్రెస్ రాజకీయాల్లో తననెప్పుడూ బయటివాడిగానే చూశారని ఆయన వాపోతున్నారు. తాను నరేంద్రమోదీని ప్రశంసించానని అంటున్నవాళ్లు తన వ్యాఖ్యలను అర్థం చేసుకోలేదని, అందువల్ల వాళ్ల విమర్శలపై స్పందించేది లేదని థరూర్ అంటున్నారు. రాజకీయాల్లోకి తాను చాలా ఆలస్యంగా వచ్చానని, అందుకే బహుశా వీటిలో సరిగా ఇమడలేకపోతున్నానేమోనని థరూర్ వ్యాఖ్యానించారు.

గాంధీజయంతి రోజున ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు సవాల్ విసిరిన తొమ్మిది మంది ప్రముఖుల్లో థరూర్ కూడా ఒకరు కావడం కేరళ కాంగ్రెస్లో తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే ఈ ఆహ్వానం వచ్చినందుకు తానెంతో గౌరవంగా ఫీలవుతున్నానని ఆయన అనడాన్ని కేరళ కాంగ్రెస్ తప్పుబట్టింది. ఆయన ప్రధానికి ప్రేమలేఖలు రాస్తున్నారని కూడా కేరళ కాంగ్రెస్ పత్రిక ఆరోపించింది. ఈ మేరకు తనపై మీడియాలో ఆరోపణలు చేసిన వారందరి వద్దా.. తన ఫోన్ నెంబరు వుందని.. ఈ విషయంలో స్పష్టత కోసం వారు నేరుగా తనకు ఫోన్ చేయవచ్చునని థరూర్ అన్నారు. అలా చేయకుండా బహిరంగ విమర్శలకు దిగారని, దాన్ని బట్టే వాళ్ల కోరిక ఏంటో తెలిసిపోతోందని థరూర్ వ్యాఖ్యానించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles