TDP | Chandrababu | president

Tdp party president chandrababu naidu ground work on tdp party future

TDP, Chandrababu, president, telangana, national party

TDP party president chandrababu naidu ground work on tdp party future. Chandrababu naidu very busy as ap cm. TDP party facing problems in telangana.

చంద్రబాబు చక్రం తిప్పుతారా..? చతికిలపడతాడా..?

Posted: 05/16/2015 04:03 PM IST
Tdp party president chandrababu naidu ground work on tdp party future

తర్వలోనే తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించనున్నారు. అయితే ఈసందర్భంగా ఆసక్తికరమైన చర్చ సైతం చోటుచేసుకుంటోంది. పార్టీ అధినేత, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ జాతీయ నేతగా వెళతారా ? లేక రాష్ట్రానికే పరిమితమవుతారా ? అనే సందేహాలు ఇంకా వ్యక్తమవుతున్నాయి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పాలన సాగుతున్న నేపథ్యంలో పార్టీ జాతీయ బాధ్యతలు చేపడితేనే బాగుంటుందనే అభిప్రాయాలు రెండు రాష్ట్రాల్లోని కీలక నేతల నుంచి వస్తున్నాయి. తెలంగాణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్‌ బాధ్యతలు మరో నాయకుడికి అప్పగిస్తారనే ప్రచారం ఆపార్టీలో జరుగుతోంది. అలాజరగకపోతే తన బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే కూడా అయిన బాలకృష్ణను ఈ మహానాడు సందర్భంగా క్రీయాశీల రాజకీయాల్లోకి తీసుకొచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ముఖ్యమంత్రిగా తీరికలేకుండా ఉంటున్న నేపథ్యంలో పార్టీ రాష్ట్ర బాధ్యతలు మరొకరికి అప్పగించే అవకాశాలు సైతం ఉన్నాయని చెబుతున్నారు. పార్టీని ఇతర రాష్ట్రాలకు సైతం విస్తరించి బలం పెంచుకోవాలని, తద్వారా కేంద్రంలో చక్రం తిప్పాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు జాతీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో జరుగుతున్న ఈ మహానాడును ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

దేశం యావత్తూ గండిపేట వైపు చూసేలా ఏర్పాట్లు చేయాలని బాబు ఆదేశించినట్లు సమాచారం. పార్టీని జాతీయస్థాయికి మలచడం ద్వారా కేంద్రంపై పట్టుసాధించే అవకాశాలు సైతం లేకపోలేదని పార్టీ శ్రేణులే అభిప్రాయపడుతున్నాయి. ఇదిలావుండగా తెలంగాణలో పార్టీ మనుగడ పెద్దసవాల్‌గా మారింది. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం, టిటిడిపికి చెందిన ఎమ్మెల్యేలను లాక్కుంటున్న నేపథ్యంలో ఈమహానాడులో దానిపై తీవ్రంగా చర్చించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అంతేగాక మహానాడులో తెలంగాణకు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారా ? లేక ప్రస్తుత అధ్యక్షులు ఎల్‌.రమణనే కొనసాగిస్తారా అనే చర్చ సైతం జరుగుతోంది. తాజా పరిస్థితుల్లో తెలంగాణకు కొత్త అధ్యక్షుడిని పెట్టి తలనొప్పులు ఎందుకు తెచ్చుకోవాలనే భావనలో సైతం చంద్రబాబు ఉన్నట్లు తెలిసింది. అలాగే రమణకు ఎమ్మెల్సీని పదవిని ఇచ్చి, ఆయన్ను జాతీయ పార్టీ కార్యవర్గంలో నియమిస్తారనే మరోరకమైన ప్రచారం కూడా జరుగుతోంది. ఇకపోతే అధ్యక్ష పదవి కోసం ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి తదితరులు పోటీపడుతున్నారు. అయితే చంద్రబాబు యధాతథ స్థితని కొనసాగించకపోతే, దళితులను సైతం ముందుకు తెస్తారని అంటున్నారు. ఇదే గనక నిజమైతే ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, జి.సాయన్న, మరోనేత మోత్కుపల్లి నర్సింహులు తదితరుల పేర్లను పరిశీలిస్తారనే ప్రచారం ఇటు టిడిఎల్పీ, అటు ఎన్టీఆర్‌ భవన్‌లో జరుగుతోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  Chandrababu  president  telangana  national party  

Other Articles